Home తాజా వార్తలు మెరిసిన బ్యూటీ

మెరిసిన బ్యూటీ

Katrina Kaif

 

‘మల్లీశ్వరి’ సినిమాలో వెంకటేష్ సరసన నటించిన ముద్దుగుమ్మ కత్రినాకైఫ్‌ని ఎవరైనా మరచిపోగలరా? సూపర్‌డూపర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రంతో ఈ బ్యూటీ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ చిత్రం తర్వాత కత్రినా మరో తెలుగు సినిమాలో నటించలేదు. బాలీవుడ్‌లో పాగా వేసి అక్కడ హీరోయిన్‌గా స్టార్‌డమ్ దక్కించుకుంది. స్టార్ హీరోయిన్‌గా హిందీలో ఎన్నో హిట్ సినిమాలు చేసి ప్రేక్షకులను అలరిస్తోంది కత్రినాకైఫ్. అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో హాట్‌హాట్‌గా దర్శనమిస్తూ అభిమానులను మైమరపిస్తోంది ఈ బ్యూటీ. తాజాగా గోల్డెన్ కలర్ డ్రెస్‌లో అందాలొలికిస్తున్న ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్ చేసింది ఈ భామ. ఈ ఫొటోలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి.

Katrina Kaif with Hot Beauty