Saturday, April 20, 2024

తాగుబోతులకు పిల్లను ఇవ్వకండి: కేంద్ర మంత్రి కౌశల్ కిశోర్

- Advertisement -
- Advertisement -

సుల్తాన్పూర్:  తాగుబోతులకు పిల్లను ఇవ్వొద్దని కేంద్ర మంత్రి కౌశల్ కిశోర్ అన్నారు. మద్యం దుష్పరిణామాలపై ఆయన లంభువాలోని సర్వోదయ్ ఇంటర్ కాలేజ్ లో  ఏర్పాటు చేసిన కార్యక్రమం ‘మత్తు నుంచి విముక్తి’ అనే టాపిక్ పై మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. మద్యానికి బానిసైన అధికారికిచ్చే కంటే ఒక కూలీ లేదా రిక్షా కార్మికుడిని పెళ్లికొడుకుగా ఎంపిక చేసుకోవడం మంచిదన్నారు. తాను ఎంపీగా, తన భార్య ఎమ్మెల్యేగా ఉండి కూడా మద్యానికి అలవాటైన తన కుమారుడు ఆకాశ్ కిశోర్ ని కాపాడుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడిని డీ అడిక్షన్ కేంద్రంలో కూడా చేర్పించామని, ఆ అలవాటును మానేస్తాడనే అనుకున్నామని,  ఆ తర్వాత ఆరు నెలలకు పెళ్లి చేసుకున్నాడని చెప్పారు. కానీ, మళ్లీ తాగడాన్ని ప్రారంభించాడని… చివరకు రెండేళ్ల క్రితం చనిపోయాడని తెలిపారు.

అతడు చనిపోయేటప్పుడు అతడి కుమారుడికి రెండేళ్ల వయస్సు మాత్రమేనన్నారు. ఇప్పుడు అతడి భార్య ఏకాకిగా మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదన్నారు. ఇలాంటి పరిస్థితి ఏర్పడకుండా మీ కూతుర్లని, అక్కాచెల్లెళ్లను కాపాడుకోవాలని తెలిపారు. మద్యం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఏటా 20 లక్షల మంది మరణిస్తున్నారన్నారు. మద్యానికి అలవాటైన వారి జీవిత కాలం చాలా తక్కువని,  పాఠశాలల్లో సైతం దీనిపై అవగాహన కల్పించాలన్నారు. సంవత్సరానికి 20 లక్షల మంది మత్తుపానీయాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నరని తెలిపారు.

Kaushal Kishore

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News