Home తాజా వార్తలు టిఆర్ఎస్ అభ్యర్థులదే విజయం : కవిత

టిఆర్ఎస్ అభ్యర్థులదే విజయం : కవిత

Kavithaనిజామాబాద్‌ : వచ్చే లోక్ సభ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధిస్తారని నిజామాబాద్ టిఆర్ఎస్ ఎంపి అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో టిఆర్ఎస్ 16 స్థానాలు సాధిస్తే, కేంద్రంలో పార్టీ అధినేత కెసిఆర్ చక్రం తిప్పడం ఖాయమని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కవిత రెంజిల్ మండలం శాటాపూర్ లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తన ఐదేళ్ల పాలనలో సిఎం కెసిఆర్ పేదల కోసం అనేక పథకాలు అమలు చేశారని ఆమె కొనియాడారు. కెసిఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిశాయని ఆమె పేర్కొన్నారు. రెంజిల్ మండలంలో ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు కటిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈ  కార్యక్రమంలో ఎమ్మెల్యే షకీల్‌, రాష్ట్ర నాయకులు మోహన్‌రెడ్డి, కార్యదర్శి విఠల్‌రావు తదితరులు పాల్గొన్నారు. రెంజల్‌ మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్‌ నాయకులు కవిత సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. లోక్‌సభ ఎన్నికల్లో కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే షకీల్‌ ప్రజలను కోరారు. పసుపు బోర్డు ఏర్పాటు కోసం కవిత ఎంతో కృషి చేశారని ఆయన కొనియాడారు.

Kavitha Comments on Loksabha Elections