Friday, March 29, 2024

మనమిప్పుడు మిలియన్

- Advertisement -
- Advertisement -

మీ ఆదరణకు కృతజ్ఞతలు : కవిత

ట్విట్టర్‌లో టిఆర్‌ఎస్ నాయకురాలు
కల్వకుంట్ల కవితకు 10లక్షల ఫాలోవర్లు
దక్షిణ భారతదేశంలోనే
తొలి మహిళా నేతగా సరికొత్త రికార్డు

Kavitha followers 10 Millions in twitter acount

మన తెలంగాణ/హైదరాబాద్: సామాజిక మీడియాలో కల్వకుంట్ల కవిత దూసుకుపోతున్నారు. ట్విట్టర్ వేదికగా ఎవరికి ఏ సమస్యవచ్చినా స్పందిస్తూ కరోనా కష్టకాలంలో నేనునున్నానంటూ ప్రజలకు భరోసా ఇస్తున్నారు. ని రంతరం ప్రజలతో మమేకమవుతున్న కవితకు ఆ దివారం నాటికి మిలియన్ ఫాలోవర్స్‌కు 1000000 చేరుకోవడం విశేషం. సామాజిక, రాజకీయ, వర్తమాన అంశాలతోపాటు ట్విట్టర్ వేదికగా చర్చల్లో పాల్గొనే కవిత నిరతరం ప్రజలకు అందుబాటులో ఉండటంతో మిలియనీర్ అయ్యారు. కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి ద్వారా ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టి, బతుకమ్మను విశ్వవ్యాప్తిచేసి మహిళానాయకురాలిగా తెలంగాణ ఉద్యమంలో మహిళాగొంతు వినిపించిన నాయకురాలు కావడంతో సోషల్ మీడియాలో అత్యధికంగా ఫాలోవర్స్ ఉన్నారు.

అలాగే ఉత్తమ పార్లమెంటేరియన్‌గా అవార్డు సాధించి, రాజకీయ, సామాజిక వ్యవహారాల్లో తనకంటూ ప్రత్యేక ముద్రవేసుకున్నారు. అలాగే అనేక సామాజిక సంస్థలకు, సింగరేణి బొగ్గుగని కార్మికులకు గౌరవ అధ్యక్షురాలుగా ఉండటంతో నిత్యం వారితో ట్విట్టర్ వేదికగా సంప్రదింపులు జరపుతారు. ఆలాగే టిఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ విభాగంలో నాయకురాలిగా సేవలందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ట్విట్టర్ లోనూ సరికొత్త ట్రెండ్ సృష్టించారు. వన్‌మిలియనీయర్ ఫాలోవర్స్‌తో దక్షిణ భారతదేశంలో ఉన్నతొలిమహిళా నాయకురాలు కవిత. ప్రాంతీయ పార్టీ నాయకురాలు, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత ట్విట్టర్‌లో ఇంతమంది ఫాలోవర్లు ఉండటం అరుదైన విషయం. 2010లో కవిత ట్విట్టర్‌లో ఖాతా ప్రారంభించి సరికొత్త ఒరవడిని సృష్టించారు. పదిసంవత్సరాల కాలంలో మిలియన్ ఫాలోవర్లు సంపాదించుకున్న కవిత ట్విట్టర్‌వేదికగా దూసుకుపోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News