Friday, July 18, 2025

సెప్టెంబర్ 30 వరకు కవ్వాల్ టైగర్ రిజర్వ్ మూసివేత

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/మంచిర్యాల ప్రతినిధిః జాతీయ పులుల సంరక్షణ సంస్థ మార్గదర్శకాల ప్రకారం వ్యాధుల వ్యాప్తిని నియంత్రించడంతో పాటు పులుల సంరక్షణ దిశగా సెప్టెంబర్ 30వ తేది వరకు కవ్వాల్ టైగర్ రిజర్వ్ మూసి వేయడం జరుగుతుందని కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాజెక్టు క్షేత్ర స్థాయి సంచాలకులు, అటవీ సంక్షేహాదికారి ఎస్, శాంతారామ్ ఒక ప్రకటనలో పేర్కోన్నారు. వర్షాకాలంలో పులుల ఆవసాలు, పర్యావరణ వ్యవస్థ, భద్రాతా సమస్యలు, పునరుత్పత్తి, వన్యప్రాణుల సంరక్షణ దృష్యా కవ్వాల్ రిజర్వ్‌ను మూసి వేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. వర్షాకాలంలో అటవీ ప్రాంతంలో ఏర్పడే ఇబ్బందుకు, వరద ప్రభావం కారణంగా పర్యాటకులు, అటవీ సిబ్బందికి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు.

పులులు సహా అనేక వన్యప్రాణుల జాతుల సంతానోత్పత్తికి వర్షకాలం ముఖ్యమైనదని, కోర్ జోన్ మూసి వేత కారణంగా వన్యప్రాణులు పునరుత్పత్తికి, పిల్లలను పోషించుకోవడానికి వీలు ఉంటుందని ఆయన తెలిపారు. అదే సమయంలో దెబ్బతిన్న మౌళిక సదుపాయలను మరమ్మత్తులు చేయడానికి రాబోపే పర్యాటక కాలానికి సిద్దం చేసేందుకు అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. అక్టోబర్ 1 నుండి తిరిగి ప్రారంభించడం జరుగుతుందని, వన్యప్రాణుల ప్రేమికులు, పర్యాటకులు, వన్యప్రాణుల సంరక్షణ కొరకు చేపట్టిన కవ్వాల్ టైగర్ రిజర్వ్ మూసివేతకు సహాకరించాలని ఆయన కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News