Friday, April 26, 2024

ఒక ఎకరా వరికి 40 కిలోల యూరియా వాడాలి: నిరంజన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

KCR aim is Farmer will be king in Telangana

రంగారెడ్డి: రైతును రాజు చేయడమే సిఎం కెసిఆర్ లక్ష్యమని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. చేవెళ్లలోని కెజిఆర్ గార్డెన్స్‌లో జరిగిన నియోజకవర్గ రైతు సదస్సులో నిరంజన్ రెడ్డి మాట్లాడారు. మన దేశంలో పుష్కలంగా వనరులు ఉన్నాయని, ప్రపంచాన్ని సాకగలిగే శక్తి మన దేశానికి ఉందన్నారు. ధాన్యం ఉత్పత్తి, సేకరణలో తెలంగాణ దేశంలోనే తొలి స్థానంలో ఉందని కొనియాడారు. మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసిన ఘనత కెసిఆర్‌కే దక్కుతుందని ప్రశంసించారు. తెలంగాణ వచ్చినంక కరెంట్, తాగు, సాగు నీటి సమస్యలు లేకుండా కెసిఆర్ చేశారని మెచ్చుకున్నారు. ప్రజలకు అవసరమైన పంటలనే పండించాలని, డిమాండ్ ఉన్న పంటలను పండిస్తేనే రైతులకు లాభం చేకూరుతుందన్నారు. గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకోలేదని నిరంజన్ రెడ్డి విమర్శించారు. రైతులకు ఆర్థిక భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నూనె గింజల ఉత్పత్తిని పెంచాలని, ఒక ఎకరా వరికి 40 కిలోల యూరియా వాడాలని, రైతులను చైతన్యవంతులు చేయాడానికే రైతు వేదికలు వచ్చాయని చెప్పారు. తెలంగాణ పత్తి ప్రపంచంలోనే శ్రేష్టమైందన్నారు. ముఖ్య అతిథులుగా మంత్రులు నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎంఎల్‌ఎ కాలె యాదయ్య, జిల్లా రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ వంగేటి లక్ష్మారెడ్డి హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News