Home స్కోర్ జిమ్నాస్ట్ అరుణకు సిఎం చేయూత

జిమ్నాస్ట్ అరుణకు సిఎం చేయూత

kcr

రూ.2 కోట్ల నజరానా, కోచ్‌కు రూ. 50 లక్షలు
మన తెలంగాణ / రాజేంద్రనగర్ : ఒలింపిక్‌లో పథకమే లక్ష ంగా జిమ్నాస్టిక్‌లో మరింత తర్ఫీదు తీసుకోవాలని ప్రపంచ జిమ్నాస్టిక్‌లో చరిత్ర సృష్టించిన బుద్దా అరుణారెడ్డికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు సూచించారు. అందుకు ఆస్ట్రేలియాలో పొందే శిక్షణ తదితరాలకు అవసరమయ్యే ఖర్చు రెండు కోట్లను ప్రభుత్వం తరపున అందజేయడానికి సిద్ధమని ఆయన ప్రకటించారు. ఆదివారం ప్రగతి భవన్‌లో జిమ్నాస్టిక్ కాంస్య పథక విజేత అరణను ఆయన ఘనంగా సన్మానించి, అభినందించారు. ఈ సందర్భంగా క్రీడల మంత్రి పద్మరావు గౌడ్, శాప్ చైర్మన్ వెంకటేశ్వరరావు సమక్షంలో బుద్దా అరుణారెడ్డిని ఏం కావాలని కోరిన ముఖ్యమంత్రి కేసీఆర్ పై విధంగా స్పందించడం హర్షనీయం. జిమ్నాస్టిక్‌లో ఏం చేస్తావో తెలియ దు తెలంగాణకు ఒలింపిక్‌లో పథకం తీసురావాలని ఆమెను కోరారు. అందుకోసం ఆస్ట్రేలియాలో తీసుకోవాల్సిన శిక్షణ వి వరాలను కోచ్ బ్రిజ్‌కిషోర్, శాప్ చైర్మన్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు అరుణ పై ప్రకటించారు. ఈ విషయాన్ని అరుణ, ఆమె కుటుంబ సభ్యులు, కోచ్‌తో పాటు, ఆమెను జిమ్నాస్టిక్ వైపు అడుగులు వేయించిన కరాటే మాస్టార్ బాలసుబ్రమణ్యం ‘మన తెలంగాణ’కు వెల్లడించారు. ఏది ఏమైనా ప్రపంచ జిమ్నాస్టిక్‌లో కాంస్య పథకం సాధించిన అరుణ ఎదురైన, నేర్చుకున్న అనుభవాలు ఒలిపిక్‌లో ప్రభుత్వ సహకారంతో తర్ఫీదు పొందితే పథకం తీసుకురావడం ఖాయమనే చెప్పాలి. కాగా అరుణ కోచ్ బ్రిజ్ కిషోర్ ఆర్థిక పరిస్థితులు తెలుసుకున్న ముఖ్యమంత్రి రూ. 50 లక్షల బహుతి నజరాన ఇస్తానని తెలిపినట్లు తెలిసింది.