Home తాజా వార్తలు ఈ బక్కోడిపై ఇంతమందా?

ఈ బక్కోడిపై ఇంతమందా?

KCR Comments On Modi in Public Blessing Meeting

మోడీ! ఇండియా నీ తాత జాగీరా?
మళ్లీ చంద్రబాబు పెత్తనం అవసరమా?
ఉత్తమ్ పనికిమాలిన దద్దమ్మ: ఆశీర్వాద సభలలో సిఎం కెసిఆర్ 

మన తెలంగాణ/హైదరాబాద్: గిరిజనులకు, ముస్లింలకు పెరిగిన జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాల్సిందిగా రాష్ట్ర మంత్రివర్గం, శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసి ఢిల్లీకి పంపిస్తే రాష్ట్రాలకు ఇవ్వాల్సిన గౌరవాన్ని కూడా పాటించకుండా ఆ ఫైల్‌ను తిప్పి పంపడంపై ముఖ్యమంత్రి కెసిఆర్ ఆగ్రహ వ్యక్తం చేశారు. రాష్ట్రాల డిమాండ్‌కు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సిన మోడీ ‘హిందు ముస్లిం’ జబ్బుతో బా ధపడుతూ తిరస్కరించడానికి దేశం ఆయన జాగీరా అని ఘాటుగానే స్పందించారు. ప్రజా ఆశీర్వాద సభ ల్లో భాగంగా బుధవారం బాన్సువా డ, జుక్కల్, నారాయణఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి, ఆందోల్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో సుడిగాలి ప ర్యటన చేశారు.

నారాయణఖేడ్, సం గారెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గాల సభల్లో కెసిఆర్ ప్రసంగిస్తూ, “నరేంద్రమోడీ! ఇండియా ఏమైనా నీ అ య్య జాగీరనుకున్నవా? లేక మీ తా త జాగిరా? ఇది ప్రజాస్వామ్యం. ఇన్ని రోజులూ మీ కాలం నడిచింది. కానీ ఇక కేంద్రంలో బిజెపి లేని, కాంగ్రెస్ లేని ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి రావాల్సిందే” అని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర పిసిసి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పనికిమాలిన దద్దమ్మ అని జహీరాబాద్ సభలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎత్తు పొడుగు ఉన్నడు కానీ ఆయనకు బుర్రలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో అప్పులు పెరిగాయంటూ ఈ దద్దమ్మలంతా విమర్శిస్తున్నారని, మనంకంటే 14 రాష్ట్రాలకు అప్పులు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పులు పరిమితికి లోబడే ఉంటాయని, ఈ దద్దమ్మలకు ఆ విషయం తెలియదని అన్నారు.

అసెంబ్లీ రద్దు ఎందుకంటే…
సమైక్యపాలనలో అప్పటి ఆంధ్రా ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రులు కాగితాలలోనే నీళ్లను చూపించారని, నీళ్లకు సరిపడా ప్రాజెక్టులు లేవని కెసిఆర్ అన్నారు. టిఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంజనీర్లు పర్యటించి ప్రాజెక్టులకు రూపకల్పన చేశారని, ప్రాజెక్టుల గురించి అసెంబ్లీలో వివరిస్తుంటే కాంగ్రెస్ సభ్యులు అసెంబ్లీ నుంచి పారిపోయారని విమర్శించారు. వాళ్లకు తెలివి లేదుకాబట్టే, తెలంగాణ పట్ల వాళ్ళకు అక్కర లేదు కాబట్టే పారిపోయారన్నారు. ఎన్నికలు ఇంకా నాలుగైదు నెలల తర్వాత జరగాల్సి ఉండేదని, ఇన్ని నెలల ముందు ఎందుకు జరుగుతున్నాయో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు. తెలంగాణలో ఎన్నడూ జరగని విధం గా అభివృద్ది, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, ప్రతిపక్షాలకు పుట్టగతులుండవని తెలిసిపోయి ప్రభు త్వం చేస్తున్న ప్రతిదానికీ అడ్డు తగులుతున్నారని, అందు కే ఎన్నికలలకు వెళ్లామని వివరించారు.

1952లో తెలంగాణ ప్రాంతా న్ని రూ.63 కోట్ల మిగులు బడ్జెట్‌తో ఉమ్మ డి ఆంధ్రప్రదేశ్‌లో కలిపారని అన్నారు. ఆ తర్వాత కట్టిన ప్రాజెక్టులన్నీ ఆంధ్రాకు అనుకూలంగా కట్టినవేనని వివరించారు. 1969 లో చెన్నారెడ్డి నాయకత్వంలో జరిగిన ఉద్యమంలో 400 మందిని కాల్చి చంపారని అన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఓడిపోతుందని తెలి సి గత్యంతరం లేక కాంగ్రెస్ పార్టీ 2014లో తెలంగాణ ఇచ్చిందని పేర్కొన్నారు. ఇప్పుడు రకరకాల గాంధీలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు.

ఎంఐఎం మా మిత్ర పక్షమే
ఎంఐఎం, టిఆర్‌ఎస్ మిత్రపక్షాలమని సిఎం కెసిఆర్ స్పష్టంచేశారు. హైదరాబాద్ నుంచి అసదుద్దీన్ కచ్చితంగా గెలుస్తారని, మిగిలిన 16 సీట్లూ టిఆర్‌ఎస్ గెలవాలని అన్నారు. దేశంలో అనేక పార్టీలు తమతో కలిసి వచ్చేందుకు సిద్దంగా ఉన్నాయని చెప్పారు. ఆ పార్టీలతో తాను మాట్లాడతానని, ఢిల్లీపై కాంగ్రెస్ వాసన, బిజెపి వాసన లేని ప్రభుత్వం ఏర్పడాలని పేర్కొన్నారు. రాష్ట్రాలకు అధికారాలు రావాలని చెప్పారు. విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అన్నింటిపైనా కేంద్రం పెత్తనం చేస్తోందని తెలిపారు. కేంద్రం అధికారాలను తన గుప్పిట్లో పెట్టుకుంటోందని వ్యాఖ్యానించారు. రాష్ట్రాలపై కాంగ్రెస్, బిజెపి కర్రపెత్తనం, ఫ్యూడల్ పాలన పోవాలంటే కచ్చితంగా కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ రావాలని అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో తాను కొన్ని రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి నాయకులతో చర్చలు జరిపానని చెప్పారు. వీటన్నింటినీ చూసిన కెసిఆర్ గట్టోడేనని తెలుసుకున్న కాంగ్రెస్, బిజెపి నాయకులు తనను దేశ రాజకీయాలలో రాకుండా అడ్డుకుంటూ తనను బయటకు రానివ్వద్దని ఇక్కడనే అణగపడుతున్నరని ఆరోపించారు. దేశ రాజకీయాలలో ఫెడరల్ ఫ్రంట్ ఉనికిని చాటుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాలు శాసించే ప్రభుత్వం కేంద్రంలో రావాలని, అందుకోసం ప్రజలంతా సిద్దం కావాలని సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు.

బిజెపి రాష్ట్రాల్లో కళ్యాణలక్ష్మి ఉందా..?
రాహుల్‌గాంధీ, తోక గాంధీ, తొండెం గాంధీ, నరేంద్ర మోడీ అడ్డంగా మాట్లాడుతున్నారని సిఎం కెసిఆర్ విమర్శించార. కాంగ్రెస్ పాలించే రాష్ట్రాలలో ఒక్కచోటనైనా రూ.వెయ్యి పెన్షన్ ఉందా..? అని అడిగారు. భారతదేశంలో 19 రాష్ట్రాలలో బిజెపి ప్రభుత్వాలు ఉన్నాయి కదా..ఎక్కడైనా కళ్యాణలక్ష్మి ఉందా..? రూ. వెయ్యి పెన్షన ఉందా..? అని ప్రశ్నించారు. వికలాంగులకు రూ.1500 పెన్షన్ ఎక్కడైనా ఉందా..? రైతుబంధు పథకం వస్తుందని జిందగీలో అనుకున్నామా..? సమైక్యపాలనలో చితికిపోయిన రైతులను బాగుచేయాలని టిఆర్‌ఎస్ ప్రభుత్వం సంకల్పించిందని అన్నారు.

మంచి, చెడులు ఆలోచించి ఓటు వేయాలి
ఎన్నికల్లో ప్రజలు గెలవాలని సిఎం కెసిఆర్ ఆకాంక్షించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల అభీష్టం గెలవాలని చెప్పారు. మంచి, చెడులు ఓట్లు వేయాలని కోరారు. ఇంటికి వెళ్లిన తర్వాత చర్చించి వివేచనతో ఓట్లు వేయాలని సూచించారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా రెండింటి మధ్యనే పోటీ అని పేర్కొన్నారు. 58 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, టిడిపిల కూటమి ఒకవైపు, 15 ఏళ్లు పోరాటం చేసి నాలుగేళ్లు పాలించిన టిఆర్‌ఎస్ మరోవైపు ఉందని అన్నారు. 58 ఏళ్లు కరెంట్ ఎట్ల ఉండె, ఇప్పుడు ఎట్ల ఉందో ఆలోచించాలని కోరారు. ఈ రోజు కరెంట్ సమస్య సమూలంగా పోయిందని తెలిపారు. కాంగ్రెసోళ్లకు తెలివి లేదు, వారు అధికారంలోకి వస్తే కరెంట్ ఖతమైతదని అన్నారు. చరిత్ర మీ కళ్ల ముందు ఉంది, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఎవరూ ఊహించని విధంగా అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. అభివృద్ది అంతా ప్రజల కళ్ల ముందే ఉందని పేర్కొన్నారు.

రాష్ట్ర సంపదను పెంచి రైతులకు, పేదలకు పంచుతున్నామని స్పష్టం చేశారు. తెలంగాణలో గత పాలకులు ఇండ్లు కట్టి ఉంటే గరీబోళ్లు ఎట్ల ఉంటరు అని ప్రశ్నించా రు. ఇప్పటికీ గరీబోళ్లు ఉన్నరు కాబట్టే డబుల్ బెడ్‌రూం ఇండ్లు కడుతున్నామని చెప్పారు. కొంచెం ఆలస్యమైనా ఫర్వాలేదు కానీ, రెండు తరాలకు ఉపయోగపడేలా ఇండ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతుబధు, రైతుబీమా పథకాలు ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. నీటి తీరువా పన్నులు రద్దు చేశామని అన్నారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే రూ.లక్ష రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం రూ.వెయ్యి ఇస్తున్న ఆసరా పెన్షన్లను రూ.2016కు, వికలాంగులకు పెన్షన్‌ను రూ.3 వేలకు పెంచి నిరుద్యోగుల కు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అలాగే రైతుబంధును పంటకు రూ.5 వేలకు పెంచి, ఏడాదికి రూ.10 వేలు ఇస్తామని చెప్పారు. – కెసిఆర్‌ను కొట్టడానికి ఇంత మందా..?

చంద్రబాబు పెత్తనం మళ్లీ అవసరమా..?
కాల్వల గట్ల వద్ద, లిఫ్టుల వద్ద మన మంత్రులు నిద్రపోయి నీళ్ల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని సిఎం కెసిఆర్ అన్నారు. 24 గంటల పాటు కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. రైతుబంధు ఇవ్వడంతోపాటు రైతు బీమా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ముస్లింలు, గిరిజనులు, దళితులు, బిసిల కోంస రెసిడెన్షియల్ పాఠశాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ పాఠశాలల్లో చదివే ఒక్కో విద్యార్థిపై రూ.1.20 లక్షలు ఖర్చుపెడుతున్నామని వెల్లడించారు. పదేళ్ల తర్వాత పేదవర్గాల పిల్లలు అమెరికా, లండన్ వంటి దేశాలలో కొట్లాడతారని అన్నారు. అలాగే మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్లు తెచ్చుకున్నామని పేర్కొన్నారు. తాము చేసిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రజల కళ్లముందు ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్‌కు నాతో కొట్లాడటం చేతకాక ఆంధ్రాకు పోయి చంద్రబాబును తీసుకొస్తున్నారని విమర్శించారు.

స్వతంత్ర తెలంగాణలో ఇంకా చంద్రబాబు పెత్తనం అవసరమా..? ఆంధ్రోళ్ల పెత్తనం అవసరమా..? అని ప్రశ్నించారు. తాగునీరు, వ్యవసాయానికి నీరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నా కేసులు వేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు తెలంగాణ ప్రయోజనాలకు ప్రతినిమిషం అడ్డంపడే వ్యక్తి అని పేర్కొన్నారు. చంద్రబాబు మన దుష్మను,ఆయన మన ఇంటికి వచ్చి మనల్నే కొడతానంటున్నారు…పడదామా..? ఉల్టా కొడదామా..? ఓటుతో కొట్టి రాజకీయ చైతన్యం చాటుకోవాలని విజ్ఞప్తి చేశారు. నా అంత సిపాయి లేడని చంద్రబాబు గప్పాలు కొడతాడని, హైదరాబాద్ నేనే కట్టానని చెప్పుకుంటాడని విమర్శించారు. చార్మినార్ కూడా ఆయనే కట్టాడా..? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ను ప్రపంచపటంలో పెట్టానని చెప్పుకునే చంద్రబాబు విద్యుత్ ఎక్కడ పెట్టాడని ప్రశ్నించారు. బక్క పలుచగ ఉన్న తనను కొట్టడానికి మోడీ, సోనియాగాంధీ, చంద్రబాబు, సిపిఐ, సిపిఎం ఇంతమందా..? అని ప్రశ్నించారు.

కాళేశ్వరం పూర్తయితే నిజాం సాగర్ నిండా నీళ్లే
కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే నిజాం సాగర్ ప్రాజెక్ట్ నిండా 365 రోజులు నీళ్లు ఉంటాయని స్పష్టం చేశారు. వర్షం పడ్డ, పడకపోయినా నాట్లు వేస్తూనే ఉంటాం. మే నెలలో నార్లు పోయాలి, రెండవ పంట మార్చిలోనే కోయాలని చెప్పాలి. ఇలాంటి పరిస్థితి వస్తేనే బంగారు తెలంగాణ తయారవుతుందని అన్నారు. నిజాం సాగర్ మీద జాకోర్, చందూర్ వద్ద లిఫ్ట్‌లు నిర్మిస్తున్నామని తెలిపారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆ లిఫ్టులకు శంకుస్థాపన చేసి ఏడాదిలోపు లిఫ్ట్‌లు పూర్తి చేసి బాన్సువాడను పచ్చతోరణంలా తయారు చేస్తామని చెప్పారు. చందూరు, మోస్తరును మండల కేంద్రాలుగా ఏర్పాటు చేస్తామని, బాన్సువాడకు డిగ్రీ కళాశాలను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డిని గెలిపించుకుంటే బాన్సువాడ మరింత అభివృద్ది చెందుతుందని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు.

దేశంలో కంటి వెలుగు ఎక్కడైనా ఉందా..?
కంటి వెలుగు కార్యక్రమం దేశంలో ఎక్కడైనా ఉందా..? అని సిఎం కెసిఆర్ అడిగారు. ఊహలో కూడా ఇలాంటి పథకాన్ని ఏ రాష్ట్రం ఆలోచించదని, తనకూ ఎవరూ చెప్పలేదని అప్పారు. తాను దత్తత తీసుకున్న ఎర్రవెల్లిలో గ్రామస్తుల కోసం ఉచితం కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేస్తే ఆ గ్రామంలో 227 మందిలో కంటి సంబంధం సమస్యలు వెలుగు చూశాయని తెలిపారు. ఆ ఒక్క ఊరిలోనే ఇంత మంది ఉంటే, రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది ఉండాలె అని గమనించి, రాష్ట్రవ్యాప్తంగా కంటివెలుగును ప్రారంభించానని వెల్లడించారు. కంటివెలుగు పూర్తయిన తర్వాత చెవి, ముక్కు, గొంతు సంబంధ సమస్యలను పరీక్షించేందుకు ఇఎన్‌టి వైద్యుల బృందం వస్తుందని తెలిపారు. ఆ తర్వాత పంటి పరీక్షలు నిర్వహించేందుకు డెంటల్ డాక్టర్లు వస్తారని, ఆ తర్వాత రక్తనమూనాలు సేకరించి రక్తపరీక్షలు నిర్వహించే బృందాలు వస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి మనిషి రక్త పరీక్షలు, బిపి, షుగర్ పరీక్షలు నిర్వహించి వాటిని రికార్డు చేసి కంప్యూటరైజ్ చేయనున్నట్లు తెలిపారు. ఎవకైనా ప్రమాదం జరిగితే వెంటనే ఒక బటన్ నొక్కితే ఆయనకు సంబంధించిన డాటా అంతా వస్తుందని, దాంతో ఆయనను త్వరగా కాపాడటానికి వీలుంటుందని వివరించారు.

రైతు సమన్వయ సమితికి ముత్యంరెడ్డి
మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డికి రాష్ట్రస్థాయి రైతు సమన్వయ సమితి బాధ్యతలను అప్పగించనున్నట్లు కెసిఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో పండిన పంటలకు గిట్టుబాటు ధర కావాలని అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మహిళా సంఘాలు నిర్వహించే విధంగా ఈ యూనిట్లను ఏర్పాటు చేసి, రేషన్ డీలర్ల ద్వారా కల్తీ లేని వస్తువులను సరఫరా చేసేలా ప్రణాళికలు సిద్దం చేసినట్లు తెలిపారు.

గిరిజనులకు అటవీ భూములు అప్పగిస్తాం
సంక్షేమంలో మనం నెంబర్‌వన్‌గా ఉన్నామని సిఎం కెసిఆర్ తెలిపారు. అన్ని వర్గాలు బాగుపడేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అటవీ భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకు భూములను అప్పగిస్తామని సిఎం కెసిఆర్ ప్రకటించారు. తెలంగాణలో రైతులు భుజం మీద తువ్వాలు వేసుకుని మేం పటేళ్లమని తిరుగుతరు, కానీ అందరికీ అప్పులు ఉన్నాయని అన్నారు. రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. తాను బతికున్నంత వరకు, టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నంతవరకు రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తామని స్పష్టం చేశారు. రైతుల అప్పులు తీరి వారి బ్యాంకు ఖాతాలలో డబ్బులు జమ కావాలన్నదే తన కోరిక అని చెప్పారు.

గత పాలకులు చెడగొట్టిన కులవృత్తులను తాము కాపాడుతున్నామని పేర్కొన్నారు. తాము చేపట్టిన కార్యక్రమాలతో చేనేత కార్మికుల ఆత్మహత్యలు తగ్గాయని అన్నారు. గీత కార్మికులకు చెట్లపై పన్నులు రద్దు చేశామని తెలిపారు. హైదరాబాద్‌లో రోజుకు 650 లారీల గొర్రెలు వస్తాయని, బయట నుంచి ఎందుకు రావాలె మన దగ్గర యాదవులు లేరా..? అని గుర్తించి 4 వేల కోట్లతో గొర్రెల పథకాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు. పేదలకు అసలు పెన్షన్ ఎంత ఇవ్వాలి అని అధికారులంతా కలిసి లేక్కేస్తే రూ.670 అవుతుందని అన్నారని, అటూ ఇటూ కాకుండా ఆ రూ.670 ఏందీ..? పేదల విషయంలో గత ప్రభుత్వాల్లా వ్యవహరించడం ఎందుకని, తానే రూ.వెయ్యి ఇద్దామని చెప్పానని పేర్కొన్నారు.

చంద్రబాబు పెత్తనం మళ్లీ అవసరమా..?

కాల్వల గట్ల వద్ద, లిఫ్టుల వద్ద మన మంత్రులు నిద్రపోయి నీళ్ల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని సిఎం కెసిఆర్ అన్నారు. 24 గంటల పాటు కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. రైతుబంధు ఇవ్వడంతోపాటు రైతు బీమా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ముస్లింలు, గిరిజనులు, దళితులు, బిసిల కోంస రెసిడెన్షియల్ పాఠశాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ పాఠశాలల్లో చదివే ఒక్కో విద్యార్థిపై రూ.1.20 లక్షలు ఖర్చుపెడుతున్నామని వెల్లడించారు. పదేళ్ల తర్వాత పేదవర్గాల పిల్లలు అమెరికా, లండన్ వంటి దేశాలలో కొట్లాడతారని అన్నారు. అలాగే మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్లు తెచ్చుకున్నామని పేర్కొన్నారు. తాము చేసిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రజల కళ్లముందు ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్‌కు నాతో కొట్లాడటం చేతకాక ఆంధ్రాకు పోయి చంద్రబాబును తీసుకొస్తున్నారని విమర్శించారు.

స్వతంత్ర తెలంగాణలో ఇంకా చంద్రబాబు పెత్తనం అవసరమా..? ఆంధ్రోళ్ల పెత్తనం అవసరమా..? అని ప్రశ్నించారు. తాగునీరు, వ్యవసాయానికి నీరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నా కేసులు వేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు తెలంగాణ ప్రయోజనాలకు ప్రతినిమిషం అడ్డంపడే వ్యక్తి అని పేర్కొన్నారు. చంద్రబాబు మన దుష్మను,ఆయన మన ఇంటికి వచ్చి మనల్నే కొడతానంటున్నారు…పడదామా..? ఉల్టా కొడదామా..? ఓటుతో కొట్టి రాజకీయ చైతన్యం చాటుకోవాలని విజ్ఞప్తి చేశారు. నా అంత సిపాయి లేడని చంద్రబాబు గప్పాలు కొడతాడని, హైదరాబాద్ నేనే కట్టానని చెప్పుకుంటాడని విమర్శించారు. చార్మినార్ కూడా ఆయనే కట్టాడా..? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ను ప్రపంచపటంలో పెట్టానని చెప్పుకునే చంద్రబాబు విద్యుత్ ఎక్కడ పెట్టాడని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడితే రాష్ట్రం అంధకారం అవుతుందని చెప్పిన కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రంలో ఇప్పుడు కరెంట్ లేదని అన్నారు. బక్క పలుచగ ఉన్న తనను కొట్టడానికి మోడీ, సోనియా, చంద్రబాబు, సిపిఐ, సిపిఎం ఇంతమందా..? అని ప్రశ్నించారు.

మోటార్ సైకిల్ ఉన్నా ఆయుష్మాన్ భారత్ ఇయ్యరట!
ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకంపై సిఎం కెసిఆర్ మండిపడ్డారు. ఆ పథకంలో చేరాలంటే 50 నిబంధనలు ఉన్నాయని, చిప్ప పట్టుకుని బిచ్చమెత్తుకునేటోడికే ఆ స్కీమ్ ఇస్తారట అని విమర్శించారు. ఆ పథకం నిబంధనల ప్రకారం తెలంగాణలో 20 శాతం మందికి కూడా రాదని తెలిపారు. మోటర్ సైకిల్ ఉన్నోడికి కూడా ఆ స్కీం రాదని అన్నారు. ఈ రోజుల్లో మోటర్ సైకిల్ లేనోళ్లు ఎవరన్న ఉన్నరా..? అని ప్రశ్నించారు. ఆ స్కీం కంటే మంచి స్కీం మనం అమలు చేస్తున్నామని చెప్పారు. సిఎం రిలీఫ్ ఫండ్, ఆరోగ్యశ్రీ అమలు చేసుకుంటున్నామని తెలిపారు. అదో దిక్కుమాలిన స్కీం అని, మంచి స్కీంను వదిలిపెట్టి ఆ స్కీమ్‌లో మేము ఎందుకు చేరాలి అని సిఎం కెసిఆర్, మోడీని ప్రశ్నించారు.

పోచారం పేరే లక్ష్మీపుత్రుడు

కచ్చితంగా తెలంగాణలో టిఆర్‌ఎస్ ప్రభుత్వమే ఏర్పడబోతుందని సిఎం కెసిఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎక్కడ పోయినా టిఆర్‌ఎస్ సభల్లో మానవ సముద్రం కనబడుతోందని అన్నారు. మన సభలకు వచ్చినంత మంది బిజెపి సభలకు రావడం లేదని చెప్పారు. ఈ జన ప్రభంజనాన్ని చూస్తుంటే పోచారం శ్రీనివాస్‌రెడ్డి గెలుపు ఖాయమని అర్థమవుతోందని అన్నారు. పోచారం వ్యవసాయ శాఖ మంత్రి అయిన తర్వాత రైతాంగం దశ మారిపోయిందని వ్యాఖ్యానించారు. పోచారం పేరే లక్ష్మీపుత్రుడని పేర్కొన్నారు. ఆ లక్ష్మీపుత్రుడి వల్ల రైతులకు లాభం చేకూరుతోందని అన్నారు. పోచారం తన ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేసి ఉద్యమంతో చేరిన తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో మీరు గెలిపించారని చెప్పారు. ఆయనను బాన్సువాడ ప్రజలంతా దీవించాలని కోరారు. వ్యవసాయ శాఖ మంత్రిగా రాష్ట్రంతో పాటు బాన్సువాడకు అద్భుతమైన సేవలను పోచారం అందిస్తున్నారని సిఎం కెసిఆర్ కొనియాడారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

KCR Comments On Modi in Public Blessing Meeting

Telangana Latest News