Thursday, April 25, 2024

అమ్మ లాలన.. తండ్రి పాలన

- Advertisement -
- Advertisement -

KCR

 

సంక్షోభ సమయంలో సమర్థ నాయకత్వం

అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే రోల్ మోడల్‌గా జనరంజక పాలన అందిస్తూనే కరోనా లాంటి సంక్షుభిత పరిస్థితులను తనదైన శైలి, వ్యూహాలతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధిగమించడాన్ని దేశమంతా ఆసక్తిగా పరిశీలిస్తున్నది. రాష్ట్రంలో 21 రోజుల లాక్‌డౌన్ ఆర్థిక పరిస్థితిని తలకిందులు చేస్తున్నా తనకు ఆర్థికం కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యమని ముఖ్యమంత్రి ఈ విషయంలో నిరూపించారు. ప్రజలు, పార్టీ, అధికార యంత్రాంగాన్ని ఒకవైపు కన్నతల్లి తన పిల్లలపై ఎలాంటి ప్రేమను కురిపిస్తుందో, లాలిస్తుం దో అలా చేస్తూనే మరోవైపు వారిని నియంత్రణలోకి తీసుకు రావడానికి తండ్రి ఎలా కొన్ని సందర్భాల్లో కఠినంగా ఉంటా రో అలా కెసిఆర్ వ్యవహరిస్తూ రాష్ట్రాన్ని కరోనా నుంచి విముక్తి చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కరోనా తొలి దశలో కరీంనగర్ జిల్లాలో కొందరు ఇండోనేషియన్లకు కరోనా అనుమానిత లక్షణాలు కనిపించగానే కెసిఆర్ స్పందించిన తీరు ఆ తర్వాత జిల్లా కేంద్రాన్ని జల్లెడ పట్టిన తీరు ఆయనకు ప్ర జల పట్ల ఉన్న నిబద్ధతతను ప్రసుటం చేసింది.

ఆ రోజున ముఖ్యమంత్రిగా కెసిఆర్ స్పందించి కరీంనగర్‌ను అష్టదిగ్బంధనానికి గురి చేయకు ంటే మరెందరో కరోనా మహమ్మారి బారిన పడేవారని ఆ జిల్లా అధికారులు చెపుతున్నారు. మ హమ్మారి కరోనా ప్రభావాన్ని విజయవంతంగా నియంత్రిస్తూనే మరోవైపు ప్రజ లు ముఖ్యంగా పేద, మధ్యతరగతి జీవన ప్రమాణాలు దెబ్బతినకుండా సాహసోపేతంగా 12 కిలోల బియ్యం, రూ. 1500 నగదు లాంటి నిర్ణయాలే కాకుండా ఎలాంటి గూడు, రేషన్ కార్డు కూడా లేని వలస జీవుల ఆకలి తీర్చడానికి వారిపై కూడా వరాల జల్లు కురిపించి తన మానవీయతను మరోసారి చాటుకున్నారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో పని చేసే 3 లక్షల పైచిలుకు కూలీలు రాష్ట్ర సరిహద్దులు దాటకుండా వారికి రాష్ట్రంలోనే కూడు, గూడు కల్పిస్తామని కుటుంబానికి 12 కిలోల బి య్యం, కుటుంబంలోని ఒక్కొక్కరికి రూ. 500ల నగదును కూడా ఆయన ప్రకటించి మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారు.

దేశమంతా లక్షల్లో వలస జీవులు రివర్స్ వలసల బాటలో ఉండగా వాళ్లంతా స్వరాష్ట్రాలకు వెళ్లకుండా ఉండడానికి వారికి ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కెసిఆర్ ‘ట్రూ లీడర్’, ‘ట్రూ స్టేట్స్ మన్’, ‘వెల్‌డన్ చీఫ్ మినిస్టర్’ అంటూ బాలీవుడ్ నటుడు సోనూసూ ద్, ట్విట్టర్‌లో స్మితా ప్రకాశ్, అగస్త కంటూలు ప్రశంసలు కురిపిస్తున్నారు. కెసిఆర్ ప్రకటించిన మరుసటి రోజే రాష్ట్రంలో వలస కూలీల ఆరోగ్య, ఆహార భద్రతకు కార్యాచరణ ప్రారంభమైందంటే ఆయనకు అధికార, పార్టీ యంత్రాంగం పై ఉన్న తిరుగులేని పట్టును నిరూపిస్తున్నది. ఈ సందర్భంగా వలస కూలీలను ఆయన తెలంగాణ పునర్నిర్మాణంలో వారు కూలీలు కాదని అభివృద్ధి భాగస్వాములని చేసిన ప్రకటనను సామాజిక శాస్త్రవేత్తలు కూడా ప్రశంసిస్తున్నారు. రాష్ట్రం నుంచి దేశం ప్రపంచం దాకా కరోనా అల్లకల్లోలం సృష్టిస్తున్నా ఆయన ఏ మాత్రం తొణకుండా బెణకకుండా తాను అప్రమత్తమవుతూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఒక వైపు ప్రజలను ఇళ్లు దాటి బయటకు రావద్దు దండం పెడతా అంటూ వినమ్రంగా రెండు చేతులెత్తి నమస్కరిస్తూనే మరోవైపు లాకౌట్ గీత దాటితే వాత తప్పదంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

అమ్మలా ప్రజలను లాలిస్తూనే తండ్రిలా కఠినంగా వ్యవహరిస్తూ రాష్ట్రాన్ని ఆయన ఒక కుటుంబంగా ముందుకు తీసుకు వెళుతున్నట్టుగా ఆయన పాలనా తీరు ప్రస్ఫుటం చేస్తున్నది. ప్రపంచంలో, దేశంలో కరోనా విశ్వరూపం దాలుస్తూ ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నా రాష్ట్రంలో మాత్రం కరోనా ప్రభావాన్ని కనీసంగా తగ్గించడంలో ఆయన అనుసరిస్తున్న వ్యూహాలు, ఆలోచనలు ‘నెవ్వర్ బిఫోర్‌” అని చెప్పక తప్పని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో కరోనా ప్రవేశించిన తర్వాత ఇప్పటి వరకు 70కు పైగా పాజిటివ్ కేసులు నమోదైనా మరణాలు మాత్రం అధికారికంగా ఒకటికి మించలేదు. అలాగే 25 వేల మందికి పైగా వ్యక్తులు వివిధ రకాల స్వీయ నిర్బంధంలో ఉన్నా వారిని కరోనా బారిన పడకుండా వైద్య ఆరోగ్యశాఖ విజయవంతమైన సేవలు అందించడంలో కెసిఆర్ దిశానిర్దేశం అసాధారణమైనది. పాజిటివ్‌గా తేలిన 70 మందిలో ఒకరు ఇప్పటికే డిశ్చార్జి కాగా మరో 13 మంది సోమవారం ఆరోగ్యంగా ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లారు. ఇద్దరు మరణించారు. మిగిలిన 61 మంది దాకా గాంధీలో చికిత్స పొందుతున్నారు.

వారంతా ప్రాణాపాయం లేకుండా సరైన వసతులు, చికిత్స, సహకారంతో కోలుకుంటున్నారు. ఒకవైపు కరోనాను ఎదుర్కోవడానికి అన్ని రకాలుగా అన్ని విభాగాలను 60 వేల మంది కరోనా బాధితులైనా చికిత్స అందించడానికి సమాయత్తం చేస్తూ మరోవైపు ఏప్రిల్ నెలలో రాబోయే పంటల కొనుగోళ్లపై ఆయన ఫోకస్ పెట్టారు. రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మారుస్తున్న క్రమంలో ఏప్రిల్ నెలలో కోటి 15 లక్షలకు పైగా రానున్న పంటల కొనుగోళ్లకు ముందు చూపుతోనే 32 వేల కోట్ల నిధులను కేటాయించి రైతులకు అంతులేని భరోసాను కల్పించారు. ఒక్కసారిగా రైతులు మార్కెట్లకు పంటలను అమ్ముకోడానికి వెల్లువెత్తితే రానున్న సంక్షోభాన్ని ముందే ఊహించి కరోనా నేపథ్యంలో ఎక్కడికక్కడ గ్రామాల్లోనే కొనుగోళ్లు చేయడానికి ప్రణాళికను రూపొందించి అమలును అధికారులు, ప్రజాప్రతినిధులకు అప్పగించారు.

గ్రామాల్లో వరి కోతల నుంచి మొదలుకుంటే పంటలను కోయడానికి ఉపయోగించే ట్రాక్టర్లకు హార్వెస్టర్లను బిగించడం ఎలా? కొనుగోలు చేసిన ధాన్యాన్ని లోడ్ అన్‌లోడ్ చేసే హమాలీలను ఇతర రాష్ట్రాల నుంచి రప్పించడం ఎలా? ధాన్యాన్ని నిల్వ చేసే 75 లక్షల గోనె సంచుల కొరతను అధిగమించడం లాంటి అనేక సవాళ్లను ఆయన ముందే ఊహించి వాటిని ఎదుర్కోవడానికి రోడ్ మ్యాప్‌ను అందించిన తీరు రైతుల పట్ల ఆయనకున్న నిబద్ధతను సూచిస్తున్నది. ఈ క్రమంలో గ్రామంలో ట్రాక్టర్లకు హార్వెస్టర్లు బిగించే పట్టణాల్లోని మెకానిక్ ఎంత మంది వారినెలా కరోనా క్రమంలో గ్రామాలకు పంపాలనే సూక్ష్మ విషయాలను కూడా ఆయన అధ్యయనం చేయడం ఆయన మైక్రోమేనేజ్‌మెంట్ తీరును తెలియజేస్తున్నది. పంటల ఉత్పత్తులే కాక ఇటీవల కరోనా భయ ప్రచారంతో పౌల్ట్రీ రంగం దాదాపుగా కుప్పకూలింది. గుడ్లు, కోళ్లు అమ్మకాల్లేక రైతులు దయనీయ పరిస్థితుల్లో భూముల్లో పాతిపెట్టారు. చికెన్, గుడ్లు తింటే కరోనా రాదని పౌల్ట్రీ ఫెడరేషన్ కొద్ది రోజుల క్రితం నెక్లెస్ రోడ్‌లో ఉచిత పంపిణీని పెద్ద ఎత్తున చేపట్టింది.

అయినా చికెన్, గుడ్ల అమ్మకాలు పెరగలేదు. కాని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు విలేకరుల సమావేశంలో కరోనా గురించి మాట్లాడుతూ అసత్య ప్రచారానికి ఫౌల్ట్రీ ఎలా కుప్పకూలిందో చెబుతూ చికెన్, గుడ్లు తినడం ఆరోగ్యకరం ఇప్పుడున్న కరోనాను ఎదుర్కోవడానికి అదే సరైన పౌష్టికాహారమని ప్రకటించారు. అలా ప్రకటించిన మరుసటి రోజు నుంచి గుడ్లు, చికెన్ రేట్లు పెరిగి ప్రజలు కొనుగోళ్లకు క్యూలు కట్టే పరిస్థితి ఏర్పడింది. గుడ్డు, చికెన్ ఉచితం నుంచి గుడ్డు రూ. 5 దాకా, చికెన్ రూ. 180 దాకా పెరిగిందంటే పాలకుడైన చంద్రశేఖర రావు మాటల పట్ల ప్రజలకు విశ్వాసం ఎంతగా ఉందో ఇది నిరూపించింది.

ముఖ్యమంత్రిగా ఆయన పాలకుడుగానే కాకుండా కరోనాను ఎదిరించడానికి రోగ నిరోధక శక్తిని పెంచే పండ్ల వినియోగం గురించి ఓ న్యూట్రిషనిస్టుగా, దక్షిణ కొరియాలో ఒక కరోనా పేషంటు వేల మందికి ఎలా వాప్తి చేసిందో చెపుతూ ఓ రీసెర్చర్‌లాగా, అభివృద్ధి చెందిన దేశాలు కరోనాను నియంత్రించలేక ఎలా చేతులెత్తాయో ఓ సామాజిక శాస్త్రవేత్తలా ఆయన చెప్పిన అంతర్జాతీయ అంశాలు కెసిఆర్ విమర్శకులకు కూడా నచ్చాయి. సోషల్ మీడియాకు గ్రహణంలా మారిన ఫేక్ రైటర్లకు సమర్థుడైన పాలకుడిగా ఇచ్చిన తీవ్ర హెచ్చరిక అవసరమైతే ఆయన ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటారో తెలియజెపుతున్నది. ఇప్పుడు కరోనా నేపథ్యంలో ఆయన నిర్వహిస్తున్న విలేకరుల సమావేశం జరుగుతుందంటే ప్రపంచ మంతా ఆయన చెప్పే విషయాల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నదనడం అతిశయోక్తి కాదు.

 

KCR Competent leadership during times of crisis
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News