Home తాజా వార్తలు ఆ విషయంలో కెసిఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: అలీ

ఆ విషయంలో కెసిఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: అలీ

KCR decision welcome by Mahmood ali

 

హైదరాబాద్: తెలంగాణ నూతన సెక్రటేరియట్ నిర్మాణంలో భాగంగా మసీదు, దేవాలయానని నిర్మించాలన్న సిఎం కెసిఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. ప్రస్తుతం పాత సచివాలయ భవనంలో ఉన్న మసీదు, దేవాలయాల కన్నా ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించేందుకు సిఎం నిర్ణయించడం పట్ల మహమూద్ అలీ హర్షం వ్యక్తం చేశారు. నూతన సెక్రటేరియట్ భవనాన్ని అధునాతన స్థాయిలో నిర్మించడంతో పాటు ప్రజలకు మరింత ఉపయోగకరంగా ఉంటుందన్నారు.