Friday, April 26, 2024

దిల్దార్ సిఎం

- Advertisement -
- Advertisement -

CM KCR

 

వలస కూలీల పట్ల కెసిఆర్ ఔదార్యానికి జాతీయ స్థాయిలో ప్రశంసలు

మానవీయ దృక్పథంలో తీసుకున్న నిర్ణయానికి కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికార వర్గాలు, సినీ, మీడియా సంస్థల మెచ్చుకోలు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములవుతున్న వలసకూలీలను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటానని ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన ప్రకటనకు జాతీయ స్థాయిలో ప్రశంసల వర్షం కురుస్తోం ది. పొట్ట చేత పట్టుకొని తెలంగాణకు వచ్చి పనిచేస్తున్న వివిధ రాష్ట్రాల వలస కూలీలను కన్నబిడ్డల్లా ఆదుకుంటామని సిఎం కెసిఆర్ ఇచ్చిన హామీ జాతీయ స్థాయిలో పలువురి దృష్టిని ఆకర్షించింది. అధికారులు నిర్వహించిన సర్వేలో గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్ తదితర రా ష్ట్రాల నుంచి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములైన 12వేల 436 మంది వలసకూలీలకు 12 కిలోల బియ్యం, ఒక్కొక్కరికి రూ.500 ఇ చ్చి కాపాడుకుంటామని సిఎం చేసిన ప్రకటన తో దిల్దార్ సిఎం కెసిఆర్ అంటూ దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ట్విట్టర్‌లో ప్రశంసిస్తూ పోస్టు చేస్తున్నారు.

కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేర కు సరిహద్దులు మూసివేయడంతో తెలంగాణ లో ఉన్న వలసకూలీలను ఆదుకోవడం ప్రభు త్వ బాధ్యతగా స్వీకరిస్తుందని రాష్ట్రంలో ఒక్క రు కూడా ఆకలితో అలమటించవద్దని సిఎం కెసిఆర్ ప్రకటించడంతో కేంద్రమంత్రులు, సెలబ్రేటీలు, జాతీయ స్థాయి మీడియా ప్రతినిధులు సిఎం కెసిఆర్‌ను దిల్‌దార్ అంటూ చేస్తున్న పోస్టులు వైరల్ అవుతున్నాయి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్న సిఎం కెసిఆర్‌ను అభినందిస్తున్నారు. మానవీయ దృక్పథంతో సిఎం కెసిఆర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు అధికార యంత్రాంగం విధులను ప్రారంభించింది. కరోనా నేపథ్యంలో వలస జీవులు ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించే విధంగా చర్యలు తీసుకుంటూ వారిని ఆదుకునే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు.

ఈ మేరకు రాష్ట్ర ఐటి, పరిశ్రమలు మున్సిపల్ శాఖమంత్రి, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు హైదరాబాద్‌లోని బిల్డర్ల అసోసియేషన్‌లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి వలస కూలీల ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చే శారు. సిఎం కెసిఆర్ నిర్ణయాన్ని అభినందిస్తూ ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ మేరకు జాగృతి వ్యవస్థాపకురాలు, మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి కెసిఆర్‌ను దిల్‌దార్ సిఎం అంటూ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. వలస కూలీలను తెలంగాణ బిడ్డలుగా భావించి కరోనా ఆరోగ్య మార్గదర్శకాలను అమలు చేయడంతో పాటు భోజనానికి ఉచిత బియ్యం, ఖర్చులకు రూ.500లు అందిస్తామని సిఎం ప్రకటన దేశానికే ఆదర్శమని కవిత ప్రశంసించారు. కల్వకుంట్ల కవితతో పాటు ఎ ఎన్ ఐ మెనేజింగ్ ఎడిటర్ స్మితా ప్రకాష్ వలస కూలీల విషయంలో వ్యవహరించాల్సిన తీరు ఇదే అని, ఇంత స్పష్టమైన విశ్వాసం కల్పించిన ముఖ్యమంత్రికి కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

ఇతర రాష్ట్రాల నుంచి వలస కూలీలను వెనక్కి పంపిస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం వలస కూలీలు తమ కుటుంబ సభ్యులుగా భావించి వారికి అండగా నిలుస్తున్న తీరు అద్భుతమని జాతీయ టివిఛానల్ ఎడిటర్ అమీష్ దెవగన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ మానవీయతను ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యమంత్రి ప్రకటనను స్థానికంగా ఉన్న పలువురు ప్రముఖులు కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. జ్వాలా గుత్తా, మంచు లక్ష్మి, సినీ యాక్టర్ ప్రియదర్శి, ప్రియా ఆనంద్, సోను సూద్ తదితరులు ముఖ్యమంత్రి నాయకత్వంపైన ప్రశంసలు కురిపించారు. కేంద్ర మంత్రులు గిరిరాజ్ సింగ్ చౌహాన్, డాక్టర్ సంజీవ్ బాల్యన్, బిజెపి ఎంపి ప్రతాప్ సింహా తదితరులు సిఎం కెసిఆర్ ను ప్రశంసిస్తూ ట్విట్టర్ వేదికగా స్పందించారు. అలాగై రాజస్థాన్, గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్ ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా సిఎం కెసిఆర్‌ను ప్రశంసించారు.

 

KCR generosity towards migrant workers
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News