Home తాజా వార్తలు హుజూర్‌నగర్‌లో నేడు కెసిఆర్ భారీ సభ

హుజూర్‌నగర్‌లో నేడు కెసిఆర్ భారీ సభ

Huzoornagar

 

మధ్యాహ్నం 2గం.కు ప్రారంభం కానున్న భారీ బహిరంగ సభ

హైదరాబాద్ : హుజూర్‌నగర్ : ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు గురువారం హుజూర్‌నగర్ పట్టణంలోని వాసవి భనన్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమయ్యే ఈ సభకు భారీగా జనసమీకరణ చేస్తున్నారు. ఇప్పటికే హుజూర్‌నగర్ నియోజకవర్గం ఎన్నిక ఇన్‌ఛా ర్జీ, మండలి చీఫ్ విప్ పల్లారాజేశ్వర్‌రెడ్డి, మంత్రులు జగీదీష్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌లతో పాటు పలువురు ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్‌ఎస్ నేతలు రెండు, మూడు రోజులుగా హుజూర్‌నగర్‌లోనే మకాం వేసి సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలు, గ్రామాలను చూట్టేసిన మంత్రులు, టిఆర్‌ఎస్ నేతలు సిఎం సభకు భారీగా తరలిరావాల్సిందిగా కోరుతూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

సభా ప్రాంగణం నలుమూలులా కెసిఆర్ కటౌట్లు, టిఆర్‌ఎస్ పార్టీ జెం డాలు ఏర్పాటు చేశారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ కూడా భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశా రు. కాగా సభకు హాజరయ్యే జనవాహని చూసి ప్రతిపక్ష పార్టీలకు అభ్యర్ధుల గుండెల్లో దడ పుట్టే విధంగా జన సమీకరణలో నేతలు నియమగ్నమై ఉన్నారు. కాగా వేదికకు సంబంధించిన ఏర్పాట్లు, సభకు తరలివచ్చిన ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా మంచినీటి వసతితో పాటు ఇతర సౌకర్యాల కల్పనపై కూడా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఇక వర్షం కురిసినా సభకు ఎలాంటి ఆటంకం కలుగకుండా ముందస్తూ చర్యలు తీసుకున్నారు.

కాగా బుధవారం మండలి చీఫ్ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డ, మంత్రులు జగదీష్‌రెడ్డి, సత్యవతి రాథోడ్ తదితరులు మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారానికి సిఎం కెసిఆర్ వస్తున్న నేపథ్యంలో నియోజకవర్గంలోని అన్ని వాడలు, గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చే అవకాశముందన్నారు. వారంతా స్వచ్చందంగా తరలిరానున్నారని పేర్కొన్నారు. సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడానికి ఏర్పాటు చేసుకున్న పార్టీ సన్నాహక సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొని దిశా నిర్దేశనం చేశారు. అనంతరం మఠంపల్లి గిరిజన నేతలు ఏర్పాటు చేసిన సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యుడు రవీంద్ర కుమార్‌తో పాటు పలువురు టిఆర్‌ఎస్ నేతలు హాజరయ్యారు.

మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన ఎంఎల్‌సి శ్రీనివాస్‌రెడ్డి
హుజూర్‌నగర్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా నెరేడుచర్ల రామాపురం లో స్థానిక మహిళలతో కలిసి ఎంఎల్‌సి శ్రీనివాస్‌రెడ్డి బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో వరంగల్ తూర్పు ఎంఎల్‌ఎ నన్నపనేని నరేందర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రామపురంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వారికి మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. బతుకమ్మలు ఆడుతూ, పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ ప్రచారాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించారు. ఈ సందర్బంగ్సా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, హు జూర్ ఉపఎన్నికలో టిఆర్ ఎస్ విజయం ఖాయమైనట్లేనన్నారు. మంచి మెజారిటీతో పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గెలుపొందుతారన్నారు. ఈ నియోజకవర్గం నుంచి మూడుసార్లు గెలిచిన ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాటలను ఎవరూ నమ్మడం లేదన్నారు. ఆయన చేసిన అభివృద్ధి కూడా ఎక్కడా కనిపించడం లేదన్నారు.

KCR is largest gathering in Huzoornagar today