Friday, April 26, 2024

చండీయాగంలో పాల్గొన్న సిఎం దంపతులు

- Advertisement -
- Advertisement -

CM-KCR

గజ్వేల్: సిద్దిపేట జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున తీగుల్ నర్సాపూర్ చేరుకున్న సిఎం కెసిఆర్ దంపతులు కొండపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చండీహోమంలో పాల్గొన్నారు. సిఎం పర్యటనలో రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎంపి సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉదయం 4.30 నుంచి చండీయాగం మొదలైంది.

సిఎం కెసిఆర్ ఉదయం 9:35 గంటలకు ఎర్రవెల్లిలో రైతు వేదికను, ఉ.9:40గంటలకు మర్కాక్ లో రైతు వేదికకు శంకుస్థాపన చేస్తారు. 9:50 గంటలకు మర్కార్ పంపుహౌస్ వద్దకు సిఎం కెసిఆర్ చేరుకుంటారు. ఉదయం 10గంటలకు సుదర్శనహోమంలో సిఎం పాల్గొంటారు. 11:30గంటలకు పంపుహౌస్ మోటార్ ను ముఖ్యమంత్రి ఆన్ చేస్తారు. 11:35 గంటలకు డెలివీ సిస్టమ్ దగ్గర గోదావరి జలాలకు స్వాగతం చెప్పనున్నారు. మ. 12గంటలకు వరదరాజపూర్ లో వరదరాజేశ్వరికి కెసిఆర్ పూజలు చేయనున్నారు.

KCR performs Chandiyagam at Kondapochamma temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News