Home తాజా వార్తలు సరిపోయేంత యూరియా నేరుగా రైతులకే చేరాలి: సిఎం కెసిఆర్

సరిపోయేంత యూరియా నేరుగా రైతులకే చేరాలి: సిఎం కెసిఆర్

CM KCR

 

హైదరాబాద్: సిఎం కెసిఆర్ ప్రగతి భవన్ లో వ్యవసాయ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేనంతగా వ్యవసాయ ఎరువులకు డిమాండ్ పెరగడంతో రైతులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడారు.  యూరియాకు డిమాండ్ రావడానికి గల కారణాలను వ్యవసాయ ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు సరిపోయేంత యారియాను తక్షణమే అందించాలని కెసిఆర్ అధికారులను ఆదేశించారు. మూడు నాలుగు రోజుల్లోనే డిమాండ్ కు తగినంత యూరియాను రైతులకు అందించాలని సూచించారు.  వివిధ నౌకాశ్రయాల్లో ఉన్న యూరియా స్టాక్ ను రైళ్లు, లారీల ద్వారా తెప్పించి నేరుగా గ్రామాలకే పంపించాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు.

KCR review with Agricultural Officials in Pragathi Bhavan