Home తాజా వార్తలు నిజాంసాగర్, సింగూరులలో తక్కువ నీటి లభ్యత : సిఎం

నిజాంసాగర్, సింగూరులలో తక్కువ నీటి లభ్యత : సిఎం

CM KCR

 

హైదరాబాద్: సిఎం కెసిఆర్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎంఎల్ఎలతో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఛాంబర్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  సిఎం కెసిఆర్ మాట్లాడారు. నిజాంసాగర్, సింగూరు ప్రాజెక్టులలో నీటి లభ్యత తక్కువగా ఉందని, ముందుగా ఆ ప్రాజెక్టుల పరిసరాల్లో ఉన్న గ్రామాలకు తాగునీటి ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రాంతాలకు సాగు, తాగునీటి కోసం సమగ్ర ప్రణాళికను తయారు చేయాలని అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. సాగు, తాగునీటి, పోడు భూముల సమస్యలపై ప్రజలతో స్వయంగా మాట్లాడేందుకు అక్టోబర్ నెలలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండు రోజుల పాటు సిఎం కెసిఆర్ పర్యటించనున్నారు. సాగు, తాగునీటి  సమస్యల శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని కెసిఆర్ వెల్లడించారు.

KCR review with Nizamabad MLAs in Pocharam Chamber