Home తాజా వార్తలు ప్రాజెక్టులపై సిఎం కెసిఆర్ సమీక్ష

ప్రాజెక్టులపై సిఎం కెసిఆర్ సమీక్ష

CM KCR

 

హైదరాబాద్: ప్రగతిభవన్ లో ప్రాజెక్టులపై  అధికారులతో సిఎం కెసిఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎంఎల్ సి పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సిఎంవొ కార్యదర్శి స్మితాసబర్వాల్, సిఎంఒ ఎస్ డి శ్రీధర్ రావు దేశ్ పాండే, ఈఎన్ సి ముళీధర్ రావు పాల్గొన్నారు. గోదావరి నదిపై నిర్మితమవుతున్న తుపాకులగుడెం బ్యారేజీకి సమ్మక్క పేరు పెట్టాలని సిఎం కెసిఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. తుపాకులగుడెం బ్యారేజీకి సమ్మక్క బ్యారేజీగా నామకరణం చేస్తూ.. జీవొ జారీ చేయాలని ఈఎన్ సి మురళీధర్ రావుకు కెసిఆర్ ఆదేశించారు.

ముక్కోటి దేవతల కరుణాకటాక్షాలు బలంగా ఉండడం వల్లే తెలంగాణలో అభివృద్ధి అనుకున్న రీతిలో సాగుతోందన్నారు. ఇప్పటికే పలు బ్యారేజీలకు, రిజర్వాయర్లకు దేవతామూర్తుల పేర్లను పెట్టుకున్నట్టు ఆయన తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుల్లోకి అనుకున్న రీతిలో సాగునీరు చేరుకుంటుందని, తెలంగాణలో కట్టుకున్న బ్యారేజీలన్నీ నిండుకుండలా మారాయని అన్నారు. రానున్న వానాకాలం నుంచి వరద నీటి ప్రవాహం పెరుగుతుందని, ప్రాణహిత ద్వారా లక్ష్మీ బ్యారేజీకి చేరుకునే వరద నీటిని ఎగువకు ఎత్తిపోసుకునే దిశగా ఇరిగేషన్ శాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు.

KCR review with officials on projects in Pragathi Bhavan