మనతెలంగాణ/తలకొండపల్లి : రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం కేసిఆర్ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర ప్రభుత్వ పాలనకు ఇతర రాష్ట్రాలు జేజేలు పలుకుతున్నాయని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. దేశంలో భూ రికార్డుల ప్రక్షాళన, అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1గా నిలిచిందని ఆయన అన్నారు. రాష్ట్ర పోలీసు వ్యవస్థ పనితీరు దుబాయ్‌లాంటి దేశాలు ప్రశంసిస్తున్నాయని ఆయన చెప్పారు. తలకొండపల్లి మండల కేంద్రంలో సుమారు 77 లక్షలతో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయాన్ని సోమవారం రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి , రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిలతో కలిసి ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. అనంతరం కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసిఆర్ అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలుపరుస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో భూరికార్డుల ప్రక్షాళన కోసం రెవెన్యూ అధికారులు , సిబ్బంది రాత్రింభవళ్ళు శ్రమించి 99 శాతం భూరికార్డుల ప్రక్షాళన చేశామని మరో ఒక శాతం కోర్టులు, ఆర్డిఓ , తహసిల్ధార్ కార్యాలయాలలో పెండింగ్ లో వున్నాయని వాటిని కుడా పూర్తిచేసేందుకు అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన పెర్కొన్నారు. ఇతర శాఖల ఉద్యోగులకు సమయ పాలన ఉందని రెవెన్యూశాఖకు లేదని వారు ఆవిశ్రాంత కృషితో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించిందని భవిష్యత్ భూ సమస్యలు ఉండవి అన్నారు. వచ్చే రభి నుండి ఎకరాకు నాలుగు వేల చోప్పున రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయమై ప్రధాని నరేంద్రమోది ప్రశంసించారని అన్నారు. సమైక్యాంద్రలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో వేనుకబడిపోయిందని రాష్ట్రానికి వచ్చే బడ్జేట్‌లో 40 వేల కొట్లు మాత్రమే తెలంగాణ కు ఖర్చుచేసి మిగతా బడ్జేట్ అంతా ఆంద్రాలోనే ఖర్చుచేశారని అన్నారు. గతంలో రాష్ట్ర బడ్జేట్ 1.30 లక్షల కొట్లు ఉండగా , ప్రస్తుత తెలంగాణ బడ్జేట్ 1.80 లక్షల కొట్లు పెరిగిందని అందులో 40 వేల కొట్లతో ప్రజాసంక్షేమానికి ఖర్చుచేస్తున్నామని అన్నారు. రాష్ట్రవృద్దిరేటు 21.7 శాతం సాధించిందని ఇదంతా రాష్ట్రముఖ్యమంత్రి కేసిఆర్ ఘనతేనని అన్నారు.
రాష్ట్రంలో ముస్లింమైనార్టీల సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని ప్రాజేక్టులు, ఇతర అవసరాల నిమిత్తం రైతుల నుండి భూములు సేకరిస్తే ఒకేవిధమైన నష్టపరిహారం కోసం కృషిచేస్తున్నామన్నారు. రైతు సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి రైతులను ఆదుకుంటున్నామని అన్నారు. కేసిఆర్ నాయకత్వంలో ఒక రక్తం బోట్టుకారకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చిందని 1969 లో 370 మంది చనిపోయిన తెలంగాణ రాలేదని కేసిఆర్ పనివిధానం మూలంగా సోనియాగాంధి కృషితోనే తెలంగాణ సాధించిందన్నారు. మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ వెనుకబడిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తొందరగా రైతులకు సాగునీరందిస్తామని రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల ద్వారా ఉమ్మడి జిల్లాలోని వికారాబాద్, పరిగి, చెవేళ్ళ , మేడ్చల్, నియోజకవర్గాలకు 5 ఏకరాలకు , డిండి ప్రాజెక్టు ద్వారా ఇబ్రహింపట్నం కు సాగునీరందిస్తామన్నారు. అయకట్టుకు టెండర్ ప్రక్రియను చేపట్టినట్లు ఆయన వివరించారు. రైతుల రుణాల ను మాఫి చేయడంతో పాటు వ్యవసాయానికి 24 గంటల కరెంటును అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్‌కే దక్కిందన్నారు. మిషన్ కాకతీయ పథకంతో గ్రామాలలోని చెరువులకు, కుంటులకు మరమ్మత్తులు చేసి పూర్తవైభవం తీసుకురావటంతో పాటు ప్రతి ఇంటికి త్రాగునీరందించేందుకు మిషన్ భగిరథ పనులు ప్రవేశపెట్టిందన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రభుత్వం అన్ని వార్గల ప్రజల సమస్యల అభివృద్దికై కంకణ భద్దులై పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు, జె.సి సుందర్ అబ్నర్, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఆర్డీఓ సి.హెచ్ రవీందర్‌రెడ్డి, ఎంపిపి లక్ష్మిదేవి రఘురాములు, జడ్పిటిసి నర్సింహ, సర్పంచ్ నిర్మల, తహసిల్ధార్ ఆర్.పి జ్యోతి, ఉన్నారు.