Home తాజా వార్తలు పూలే స్ఫూర్తితో కెసిఆర్ పాలన: ఎర్రబెల్లి

పూలే స్ఫూర్తితో కెసిఆర్ పాలన: ఎర్రబెల్లి

పూలే స్ఫూర్తితో కెసిఆర్ పాలన
పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

KCR rule is spirit of Phule

 

మనతెలంగాణ,హైదరాబాద్: మహాత్మ జ్యోతిరావు ఫూలే కన్న కలలు సాకారం చేసేలా సిఎం కెసిఆర్ పాలన సాగిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం మహాత్మాజ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా ఆయనకు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మ ఫూలే స్ఫూర్తితోనే తెలంగాణలో సిఎం కెసిఆర్ పరిపాలన చేస్తున్నారని గుర్తుచేశారు.ఫూలే పేరుతోనే బిసిల విద్యకు,ఉపాధికి పెద్దపీట వేసి ఆ వర్గాల వారి అభివృద్ధికి బాటలు వేస్తున్నారని వెల్లడించారు. సబ్బండ వర్గాల కోసం కెసిఆర్ పలు పథకాలను అమలు చేస్తున్నారు. సమాజ అభివృద్ధి కోసం మహాత్మా జ్యోతి రావు పూలే కన్న కలలను సాకారం చేసేది సిఎం కెసిఆర్ మాత్రమే అని తెలిపారు.

పూలేకు ఘనంగా నివాళి…
మనతెలంగాణ,హైదరాబాద్: మహాత్మజ్యోతిరావు పూలే కన్న కలలను సాకారం చేసే విధంగా సిఎం కెసిఆర్ పాలన చేస్తున్నారని బిసి కమిషన్ సభ్యులు సిహెచ్ ఉపేంద్ర అన్నారు. ఆదివారం పూలే వర్థంతి సందర్భంగా ఆయన నివాళి అర్పించారు. సిఎం కెసిఆర్ వెనుకబడిన తరగతుల విద్య, ఉపాధికి పెద్ద పీట వేస్తూ వారిని అన్ని రంగాల్లో ముందుకు తీసుకొచ్చేందుకు అనేక చర్యలు చేపడుతూ పూలేగారి కలలు నిజం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు.