Saturday, March 25, 2023

బంగారు తెలంగాణ దిశగా కెసిఆర్ పాలన

- Advertisement -

flower

*సాగునీరును అడ్డుకునేందుకు ప్రయత్నం
చేసిన చంద్రబాబు
*తెలంగాణను పాడుచేసేందుకే కాంగ్రెస్
కంకణం కట్టుకుంది
*రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

మన తెలంగాణ/కొత్తకోట: మూడున్నర సంవత్సరాల కాలంలో సిఎం కెసిఆర్ బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నారని పాలనను కొనసాగించే ందుకు ప్రజలు స్వాగతం పలకాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్య క్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని అమడబాకుల గ్రామంలో ఎంఎల్‌ఎ ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి అంగన్‌వాడీ భవనం, యాదవ కమ్యూనిటీ హాల్, అంతకు ముందు గొర్రెలకు నట్టల నివారణ మందుల పంపిణీ, సిసి రోడ్డుకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సీమాంద్ర పాలన ఎన్నికల్లా మన రాష్ట్రంలో ఎన్నికలు జరుగ లేదని తెలంగాణ ,ఆంధ్రా పొత్తుల సద్దిని ఆంధ్రావాళ్లు అక్రమంగా తింటుంటే కొట్లాడి సాధించుకున్నదే  తెలంగాణ రాష్ట్రం అని ఆయన పేర్కొన్నారు.1400 తెలంగాణ అమరవీరుల సాధన ఫలితంగానే రాష్ట్రం సాధించుకున్నామన్నారు. నాటి నుండి నేటి వరకు సీమాంద్ర కుట్రలు ఆగ డం లేదన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కరెంట్ ఇవ్వకుండా కేంద్రం చెప్పిన కూడా డబ్బులు చెల్లిస్తామన్నాకూడా చంద్రబాబు కరెంట్ ఇవ్వలే దన్నారు. ముందస్తు ఆలోచనలతో ఛత్తీష్‌ఘడ్‌తో విద్యుత్‌ను ఒప్పందం చేసు కొని రాష్ట్రం ఏర్పడిన 6 రోజుల్లోనే విద్యుత్ ను అందజేసిన ఘనత సిఎం కెసిఆర్‌కేదక్కిందని ఆయన పేర్కొన్నారు. మొన్న జరిగిన కృష్ణా వాటర్ మేనేజ్ మెంట్ బోర్డు కు చంద్రబాబుకుట్రపూరితంగా తెలంగాణకు సాగు నీరు ఇవ్వకూడదని ఆంధ్రలో వరి ఎక్కువగా పండుతుందని భారత దేశానికి ఇక్కడి నుండే బియ్యం సరఫరా అవుతుందని లేఖ రాయడం సిగ్గుచేటన్నా రు. ఈ విషయంపై కాంగ్రెస్ నాయకులు కనీసం స్పందించకపోవడం విచారకరమన్నారు. 1100 ఏళ్ల నాటి నుండి కాకతీయుల కాలం నుండి తెలంగాణలో వరి పంటలు అధికంగా పండుతున్నాయన్నారు. సీమాంధ్రలో అతి తక్కువగా వరి పంటలు పండించేవారని ఈ విషయం చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలన్నారు. ఉమ్మడి పాలమూర్ జిల్లాలో 32 లక్షల ఎకరాలు సాగు నీరు అందించేందుకు పాలమూర్ -రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ నాయకులు పచ్చని పొలాలను జీర్ణించుకోలేక కోర్టుల్లో కేసులు వేసి అభివృద్ధిని ఆపి స్వచ్ఛమైన తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేకపోతున్నారన్నారు.
టిడిపి మొలకెత్తని విత్తనం లాంటిది: రాష్ట్రంలో గత ప్రభుత్వాలు విద్యుత్ ఇవ్వలేకరైతులనుచితకబాదడంతో పాటు కాల్చిచంపిన సంఘటనలు ఉన్నా యి. రైతులు అడగముందే 24 గంటల కరెంట్ ఇస్తే కాంగ్రెస్ నాయకు లు ఎవ్వరినిఅడిగిఇచ్చారని ప్రశ్నించడం విచారకరమని నిరంజన్ రెడ్డి అన్నారు. టిడిపి మాత్రం రాష్ట్రంలో మొలకెత్తని విత్తనం లాంటిదని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News