Friday, March 29, 2024

కాకు వ్యతిరేకం

- Advertisement -
- Advertisement -

KCR

 

వచ్చే అసెంబ్లీలో తీర్మానం చేస్తాం, చట్టాన్ని కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలి, భారత్‌ను హిందూ దేశంగా చేయాలని బిజెపి చూస్తోంది, కాను సుప్రీం కోర్టు సుమోటోగా కొట్టేయాలి, త్వరలో హైదరాబాద్‌లో కా వ్యతిరేక పక్షాలతో భేటీ

నేను భయంకరమైన హిందువుని
బిజెపి జెప్తె నేను మంత్రాలు చదువుతనా?
నాలా మంత్రాలు.. యోగాలు చేస్తరా?
20 సీసాల రక్తం తీసుకొని దుక్కలాగున్నావ్ అన్నర్
నన్ను బంద్ చేసుకోమంటవా…
నా మీద కోపమెందుకయ్యా? (విలేకరితో ఛలోక్తులు)
పదవులపై నిర్ణేతలు ప్రజలు
నేనే ఉంటా… తొందరెందుకయ్యా
ప్రజలుండమంటున్నరయ్యా

హైదరాబాద్ : కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ బిల్లుకు తాము పూర్తిగా వ్యతిరేకమని టిఆర్‌ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. ఈ బిల్లుపై కేంద్రం తప్పుడు నిర్ణయం తీసుకుందని వ్యాఖ్యానించారు. బిల్లులో ముస్లింలను పక్కన పెట్టడం ఎంత మాత్రం మంచిదికాదన్నారు. ఈ నేపథ్యంలో ఈ బిల్లును వెంటనే కేంద్రం వెనక్కు తీసుకోవాలని సిఎం కెసిఆర్ డిమాండ్ చేశారు. త్వరలో ప్రారంభకానున్న అసెంబ్లీ సమావేశాల్లో బిల్లుకు వ్యతిరేకంగా ఒక తీర్మానం చేస్తామన్నారు. కేంద్రం తీసుకొచ్చిన సిఎఎ బిల్లుపై దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులతో తాను వ్యక్తిగతంగా మాట్లాడాన్నారు. వారంతా సిఎఎ బిల్లును వ్యతిరేకిస్తున్నారని సిఎం కెసిఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలో బిల్లును వ్యతిరేకించే సిఎంలతో కలిసి త్వరలోనే హైదరాబాద్‌లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కెసిఆర్ పేర్కొన్నారు.

కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ భారత్‌ను హిందూమత దేశంగా మార్చేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. ప్రస్తు తం దేశంలోని పదహారు మంది ముఖ్యమంత్రులు పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తున్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా కెసిఆర్ అన్నారు. భారతదేశం ప్రజల దేశంగా ఉండాలని, మత దే శంగా ఉండరాదని ఆయన ఆకాంక్షించారు. అందుకే కేంద్రం వైఖరి ని, కేంద్రమంత్రి అమిత్ షా ధోరణిని తాము సమర్థించమని స్పష్టం చేశారు. 370 చట్టం రద్దును తాము సమర్థించామని, అది దేశానికి సంబంధించిన విషయమన్నారు. “దేశంపై మతతత్వ ముద్రపడుతు ంటే మనం మౌనంగా ఉంటే విదేశాల్లో మన ప్రతిష్ట దెబ్బతింటుంది. విదేశాల్లో ఉండే మన పిల్లల భవిష్యత్‌కు అది క్షేమం కాదు. పౌరసత్వ సవరణ బిల్లు వందశాతం తప్పుడు బిల్లు. సిఎఎను ను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని కొట్టిపారేయాలి. సిఎఎను వ్యతిరేకిస్తూ అవసరమైతే 10 లక్షల మందితో సభ నిర్వహిస్తాం” అని కెసిఆర్ తెలిపారు.

పిడికెడంత దేశం పాకిస్థాన్..
పాకిస్థాన్‌కు సిఎం కెసిఆర్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆ దేశాన్ని పిడికెడంత దేశంగా అభివర్ణించారు. పిచ్చిపిచ్చిగా వ్యవహిస్తే చూస్తూ ఊరుకోమని కెసిఆర్ హెచ్చరించారు. భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ కుట్రలు పన్నినంత కాలం ఆ దేశాన్ని శత్రుదేశంగానే చూస్తామన్నారు. మన భారతదేశ అంతర్గత వ్యవహారాలలో పాకిస్థాన్ జోక్యా న్ని ఎట్టి పరిస్తితుల్లో సహించేది లేదని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. పాకిస్థాన్ వ్యవహారంలో కేంద్రం తీసుకునే నిర్ణయాలను దేశ సమగ్రత కోసం ఎప్పుడు సమర్ధిస్తామన్నారు. ఇందులో భాగంగానే జమ్మూ, కాశ్మీర్‌లోని ఆర్టికల్ 370ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పుడు టిఆర్‌ఎస్ సంపూర్ణ మద్దుతు ఇచ్చిందన్న విషయాన్ని సిఎం కెసిఆర్ గుర్తు చేశారు. అయితే నూతన పౌరసత్వ సవరణ చట్టం దేశ సమగ్రతకు విఘాతం కలగించే విధంగా ఉండడం వల్ల వ్యతిరేకిస్తున్నామన్నారు.

నన్ను మించిన హిందువు ఎవరు లేరు
ఈ రాష్ట్రంలో నన్ను మించిన హిందూ మరెకరు లేరని సిఎం కెసిఆర్ అన్నారు. తాను చేసిన యాగాలు, పూజలు ఎవరూ చేయలేదన్నా రు. నేను ఏది చేసినా బాహటంగానే ప్రజాక్షేత్రంలోనే చేస్తానన్నారు. ప్రతి రోజు ఉదయం గాయత్రి మంత్రం జపించందే…. తన దిన చర్య ప్రారంభంకాదన్నారు. చినజీయర్ స్వామికి పొర్లు దండాలు, శారదాపీఠం స్వామీజీలకు సాష్టంగా నమస్కారాలు చేశానన్నారు. తాను హిందూ కావడంతోనే స్వామీజీలను సంప్రదాయంగా నమస్కరించాను…పూజించాను అని అన్నారు. అంతే తప్ప బిజెపి నాయకు వలే కేవలం పైకి హిందుత్వం గురించి మాట్లాడలేదన్నారు.

వారు దేశానికి ఏం చేశారో చెప్పాలని కెసిఆర్ డిమాండ్ చేశారు. భారత్‌ను హిందూ దేశంగా చేయాలని బిజెపి వ్యవహిస్తోందన్నారు. ఈ అంశంపై ప్రపంచంలోని పలువురు మేథావాలు విచారం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో శతాబ్ధాల నుంచి హిందూవులు, ముస్లింలు, సిక్కులు, జైన్‌లు, బౌద్దులు తదితర మతాల వారంతా కలిసి జీవిస్తున్నారని గుర్తు చేశారు. ఇలాంటి సమయంలో కేంద్రం నూతన పౌరసత్వ చట్టాన్ని తీసుకరావడం వల్లే వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.

కేంద్రం సక్రమంగా పనిచేయడం లేదు
కేంద్ర ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదని సిఎం కెసిఆర్ అన్నారు. కేంద్రం ఆలోచనా సరళి కూడా సరిగా లేదన్నారు. ఒక్క తెలంగాణకే కేంద్రం రూ.5వేల కోట్లు బాకీ పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తూర్పారబట్టారు. కేంద్రం మాటలు కోటలు దాటుతున్నాయని, చేతలు మాత్రం గడప దాటట్లేదని విమర్శించారు. ఐజిఎస్‌టి కింద రూ.2012 కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉందన్నారు. అలాగే జిఎస్‌టి రూపంలో రూ. 1131 కోట్లు రావాల్సి ఉందని కెసిఆర్ తెలిపారు. గత ఐదేళ్లు తెలంగాణ రాష్ట్రం భారత్‌లోనే నెంబర్ వన్‌గా ఉందన్నారు. ప్రతి సంవత్సరం 21శాతం రాష్ట్రాభివృద్ధి పెరుగుదల ఉండేదని, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ విధానాల పుణ్యమా అని రాష్ట్రం అభివృద్ధి రేట్ 9.5 శాతంగా ఉందన్నారు. ఈ నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ త్వరలో లేఖ రాస్తామనారు.

పేదలపై భారం పడకుండా పన్నులు
గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే మున్సిపాలిటిలు, గ్రామపంచాయతీల్లో పన్నులు పెంచాల్సిన అవసరముందని సిఎం కెసిఆర్ అన్నారు. అయితే పేదలపై ఎలాంటి భారం ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పన్నుల విధానంలో పలు సవరణలు తీసుకరానున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థలు కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులపైనే ఆధారపడకుండా సొంతంగా నిధుల సమీకరణపై దృష్టి సారించాల్సి ఉంటుందన్నారు. ఈ దిశగా త్వరలోనే స్థానిక సంస్థలకు తగు మార్గదర్శకాలను నిర్దేశించనున్నట్లు సిఎం కెసిఆర్ తెలిపారు. రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి చెందాలన్న లక్షంతోనే పట్టణ ప్రాంతాల పరిధిలోని పలు పంచాయతీలను అప్‌గ్రేడ్ చేసి మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దినట్లు సిఎం తెలిపారు. అలాగే అభివృద్ధికి నోచుకోని గ్రామాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి కొత్తగా గ్రామపంచాయతీలను ఏర్పా టు చేశామన్నారు.

KCR SAID we Opposing Citizenship Bill
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News