Home రాష్ట్ర వార్తలు అమ్మ ఒడి మొదటి బడి

అమ్మ ఒడి మొదటి బడి

CM-KCR

మాతృభాష వికాసానికి శతథా సహస్రథా ప్రయత్నిస్తా తెలుగు పండితుల సమస్యలు వారంలో పరిష్కరిస్తా మహాసభల ప్రారంభ వేదిక అధ్యక్షోపన్యాసంలో సిఎం కెసిఆర్

మన తెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణ వేదికగా తెలుగు భాషా వికాసానికి శతథా సహస్రథా ప్రయత్నిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఆయన అధ్యక్షోపన్యాసం చేస్తూ.. దాశరథి, కాళోజీ వంటి కవుల పురస్కారాలను ప్రతి సంవత్సరం ప్రదానం చేస్తున్నామని తెలిపారు. గతంలో గురువులను బతుకలేక బడిపంతుళ్లు అనే వారని, వారు సమాజాన్ని బతికించేవారే కాకుండా భవిష్యత్ సమాజ నిర్మాతలని, తెలుగు భాషా వైభవం వారి చేతుల్లోనే ఉందని ఆయన వెల్లడించారు. తెలుగు భాష విశ్వవ్యాప్తం కావాల్సి న అవసరం ఉందన్నారు. భాషా పండితుల సమస్యను వారంలో పరిష్కరిస్తామని ఆయన ఈ సందర్భంగా హర్షధ్వానాల మధ్య వెల్లడించారు. తెలంగాణ అద్భుతమైన సాహిత్యాన్ని పండించిన మాగాణమని, పదిహేడవ శతాబ్దిలోనే కురిక్యాల శాసనం బయటపడిందని, ఇందులో ఉన్న కందపద్యాలను జిన వల్లభుడు రచించాడని చరిత్ర తెలియజేస్తున్నది. పోతన, రామదాసు, సురవరం, దాశరథి, సినా రె, కాళోజీ, వానమామలై  వరదాచార్యులు తెలుగు సాహిత్యాన్ని వికసింపజేశారని ఆయన చెప్పారు. ఈ రోజుల్లో అందెశ్రీ, గోరెటి వెంకన్న, అంపశయ్య నవీన్, సుజాతరెడ్డి, అశోక్ తేజ లాంటి వారు అద్భుత సాహిత్య రచనలు చేస్తున్నారని ఆయన ప్రశంసించారు.

అమ్మ ఒడే మొదటి బడి అని, అమ్మ ఒడి నుంచి మన జీవిత ఒరవడి, మన నడవడి ప్రారంభమవుతుందన్నారు. పాలు తాగిస్తూ జో అచ్యుతానంద … జో జో ముకుందా అంటూ పాటలు పాడుతూ జ్ఞానా న్ని అందిస్తుందని, ప్రపంచాన్ని నేర్పేది కూడా తల్లేనని, తల్లి తర్వాత గురువు ముఖ్యుడని చెబుతూ తన తండ్రి చక్కటి పద్యాలను నేర్పాడని తెలియజేస్తూ, శ్రీరాముని దయ చేతను పద్యాన్ని ఉదహరించారు. విద్యకు గురువుల ప్రాపకం ఎంతో అవసరమన్నారు. ఎన్నో నీతి శతకాలు రాయబడ్డాయ ని చెబుతూ అప్పిచ్చు వాడు వైద్యుడు పద్యాన్ని ఉదహరించారు. సరళమైన అమ్మ భాషలో గురు వు తనకు విద్య బోధించారని మృత్యుంజయశర్మ తనకు విద్య నేర్పారని గనుకనే ఆయనకు ఈ వేదికపై పాద పూజ చేశానని తెలిపారు. భాషను విస్తరింపజేసేందుకు సంకల్పం తీసుకోవాల్సిన అవస రం ఉందని చెబుతూ, తన జీవితంలో జరిగిన సం ఘటనలను ఉటంకించారు. గురువులు తనను సా న పట్టారని, అయితే తాను రత్నాన్ని అయినానో కాలేదో తెలియదన్నారు.

ముదిగొండ వీరభద్ర య్య లాంటి ఉద్ధండులైన గురువులు తనకు దొరికారని, వారి మూలంగానే తను సాహిత్యాన్ని నే ర్చుకోగలిగారన్నారు. నేటికి భాషను రంజింపజేసే గురువులున్నారు కాబట్టే భాష పరిఢవిల్లుతోందని, ఇంకా భాషా వికాసానికి కృషి కొనసాగాల్సి ఉందన్నారు. తెలుగు భాష అజంతా భాష అని, శతావధానాలు, అష్టవధానాలు, ద్వర్ధి, త్రర్థి కావ్యాలు అ ప్పట్లోనే సిద్ధిపేటలో బాగా ప్రాచుర్యం పొందాయని చెప్పారు. ఈ సందర్భంగా పలు పద్యాలను ఆ యన సోదాహరణంగా వివరించారు. బమ్మెర పోతన నాటి నుండే శతక సాహిత్యంలో ధిక్కార కవిత్వం వచ్చిందన్నారు. భాషకు తోడు సంస్కా రం కూడా ఉండాలని, అది లేకపోతే చదువుకు సా ర్థకత లేదని ఆయన అన్నారు. గోరెటి వెంకన్న లాంటి కవులు చక్కటి తెలుగు, తెలంగాణ యాస లో గల్లీ చిన్నది, జయరాజ్ రాసిన వాన వానమ్మ ఒక్కసారి వచ్చి పోవమ్మా అన్న పాట రాష్ట్రం నాలుగు చెరుగులా మార్మోగిందన్నారు.

పద్యాలతో అలరించిన ఉపన్యాసం: ముఖ్యమం త్రి కెసిఆర్ తన ప్రసంగం ఆద్యంతం ప్రాచీన, నవీ న కవుల పాటలు, పద్యాలను ఉటంకిస్తూ ప్రసంగించారు. అప్పిచ్చువాడు వైద్యుడు, శ్రీరాముని దయ చేతను, జో అచ్యుతానంద.. జో జో ముకుం దా.. ఆరంభించరు నీచ మానవుల్ …లాంటి ప ద్యాలను పేర్కొన్నారు. వేమన సులభశైలిలో రాసి న పద్యాన్ని చెబుతూ నల్లని వాడు, పద్మ నయనముల వాడు … అంటూ అందరికి తెలిసే రీతిలో ఆ యన రచనలు సాగాయని చెప్పారు. ఆయన రాసి న ఇంకో పద్యంలో అందుగలడు ఇందు లేడని సందేహం వలదు.. చక్రి సర్వోపగతుండు.. ఎం దెందు వెతికి చూసిన అందందే గలడు.. అనే ప ద్యాన్ని ఉటంకిస్తూ దీంట్లో తెలియని పదాలు ఏ మున్నాయని ఆయన ప్రశ్నించారు. సరళమైన, కమ్మనైనా, మామూలు తెలుగు తెలిసిన వారు గ్ర హించగలిగినట్టు రచించారన్నారు. సందర్భం వ స్తే కవులు దీటుగా విమర్శిస్తారు. భగవంతున్ని కూడా వదలరన్నారు. బాలసంద్ర సిరితా వచ్చినా వచ్చున్.. పోయినా పో వున్ అనే ఆటవెల ది, కంద పద్యం అక్కరకు రాని చుట్టం ఉన్నా, లేకపోయినా ఒక్కటే అనే అర్థంలో రాశారన్నారు. కా ర్యసాధకుని లక్షం ఏ విధంగా ఉండాలో చెబు తూ, ప్రారంభించరు నీచ మానవులు పద్యం పాడారు.