Tuesday, April 23, 2024

తెలంగాణ కల సంపూర్ణంగా నెరవేరింది: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

KCR speech on Kondapochamma Sagar

సిద్దపేట: కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవం రాష్ట్ర చరిత్రలో ఉజ్వలమైన ఘట్టమని సిఎం కెసిఆర్ అన్నారు. కొండపోచమ్మ జలాశయం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ… ”తెలంగాణ కల సంపూర్ణంగా నెరవేరింది. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చనవారి త్యాగాలు వెలకట్టలేనివి. భూములు కోల్పోయిన వారందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా. పునరావాసం కూడా అద్భుతంగా కల్పించామన్న తృప్తి ఉంది. పుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో నిర్వాసితులు కుటుంబాలకు న్యాయం చేశామని కెసిఆర్ తెలిపారు.

ఏ లక్ష్యాన్ని గమ్యాన్ని ఆశించి తెలంగాణ పోరాటం చేశారో.. ఆ కల సంపూర్ణంగా సాకారమైన ఘట్టం ఇది. ఇది అధ్బుతమైన ప్రాజెక్టు. భూ నిర్వాసితులు సహకారం వల్లే ప్రాజెక్టు పూర్తైంది. లక్షలాది ఎకరాలకు ప్రాజెక్టుతో నీళ్లు అందుతాయి. గజ్వేల్ పట్టణానికి ప్రతిరూపంగా న్యూ గజ్వేల్ టౌన్ రూపుదిద్దుకుంటుంది. భూ నిర్వాసితులు కోసం విశేష కృషి జరుగతోంది. భూ నిర్వాసితుల త్యాగాన్ని గుర్తు చేసుకోకుండా ఉండలేం. కొండపోచమ్మ సాగర్ నిర్మాణం అత్యంత సాహసోపేత నిర్ణయం. ఎస్సారెస్సీ తరువాత అంత పెద్ద రిజర్వాయర్ మల్లన్న సాగర్. మూడు నాలుగేళ్లలో 165 టిఎంసిల కొత్త రిజర్వయర్ లు సాధించినం. ఇవాళ నాకు చాలా గర్వంగా ఉందని సిఎం పేర్కొన్నారు.

రూ. లక్ష కోట్ల పంటను తెలంగాణ రైతాంగం పండించబోతోంది. దేశంలో 83లక్షల టన్నుల వరిధాన్యం సేకరిస్తే.. అందులో 53లక్షల టన్నుల ధాన్యం తెలంగాణ నుంచి వచ్చింది. 63 శాతం వరిధాన్యం సేకరణలో తెలంగాణలోనే జరిగింది. ఆరేళ్ల కింద అనాథ తెలంగాణ నేడు పసిడి పంటల తెలంగాణ అయింది. ఇంజనీరింగ్ అద్భుతం కాళేశ్వరం ప్రాజెక్టు. తెలంగాణ ఇంజనీర్ల ప్రతిభకు నిదర్శనం కాళేశ్వరం ప్రాజెక్టు. యావత్ తెలంగాణ ఇంజనీర్లకు సెల్యూట్ చేస్తున్నా. లిఫ్ట్ మోటర్లు నడవడానికి 521 కి.మీ మేర కొత్త విద్యుత్ లైన్లు వేసినం.

విద్యుత్ శాఖ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. భూసేకరణ కోసం కష్టపడిన రెవెన్యూ సిబ్బందకి ధన్యవాదాలు. వర్కింగ్ ఏజెన్సీలు చాలా గొప్పగా పని చేసినయి. పేరున్న కంపెనీలన్నీ కాళేశ్వరం కోసం పని చేశాయి. వలస కార్మికులను వారి గమ్యస్థానాలకు చేర్చుతున్నాం. 48 డిగ్రీల టెంపరేచర్ లో ప్రాజెక్టు కోసం పని చేసిన ఇతర రాష్ట్రాల కూలీలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్న. ప్రాజెక్టు గురించి రాసిన జర్నలిస్టు మిత్రులకు కృతజ్ఞలు” అని సిఎం ప్రసంగాన్ని మూగించారు.

CM KCR Press Meet after releasing Kondapochamma Sagar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News