Thursday, April 25, 2024

ఇది చీకటిరోజు

- Advertisement -
- Advertisement -

భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటిరోజు.ప్రధాని మోడీ పాలన ఎమర్జెన్సీని మించిపోయింది. నేరస్తులు, దగాకోరుల కోసం ప్రతిపక్ష నాయకులపై అనర్హత వేటు వేసి మోడీ పతనాన్ని కొని తెచ్చుకుంటున్నారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్య త్వంపై అనర్హత వేటు వేయడం మోడీ దురంహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ట. పార్లమెంట్‌ను సైతం తమ హేయమైన చర్యలకోసం మోడీ ప్రభుత్వం వినియోగించుకోవడం గర్హనీయం.
– కెసిఆర్,
                                                                                       బిఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి

మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్రంగా ఖండించారు. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటిరోజు గా ఆయన అభివర్ణించారు. ప్రధాని మోడీ పాలన ఎమర్జెన్సీ ని మించిపోతుందని కెసిఆర్ మండిపడ్డారు. ఈ మేరకు ఆ యన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. నేరస్తులు, దగా కోరుల కోసం ప్రతిపక్ష నాయకులపై అనర్హత వేటు వేసి మోడీ పతనాన్ని కొని తెచ్చుకుంటున్నారని కెసిఆర్ అందులో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్య త్వంపై అనర్హత వేటు వేయడం నరేంద్రమోడీ దురంహంకా రానికి, నియంతృత్వానికి పరాకాష్ట అని ఆయన ఆవేదన వ్య క్తం చేశారు. రాజ్యాంగబద్ద సంస్థలను దుర్వినియోగం చేయడమే కాకుండా అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంట్‌ను సైతం తమ హేయమైన చర్యలకోసం మోడీ ప్రభుత్వం వినియోగించుకోవడం గర్హనీయమన్నారు.

ప్రజా స్వామ్యానికి రాజ్యాంగ విలువలకు చేటుకాలం దాపురిం చిందని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ పాలన ఎమర్జెన్సీని మించిపోతుందన్నారు. ప్రతిపక్ష నాయకులను వేధించడం పరిపాటిగా మారిపోయిందని అన్నారు. పార్టీల మధ్య ఉండే వైరుధ్యాలకు ఇది సందర్భం కాదన్నారు. దేశంలో ప్రజాస్వా మ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం కోసం బిజెపి ప్రభుత్వ దుశ్చర్యను ప్రజాస్వామ్యవాదులందరూ ము క్తకంఠంతో ఖండించాలని ఆయన సూచించారు. బిజెపి దుర్మార్గ విధానాలను ప్రతిఘటించాలని కెసిఆర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News