Friday, March 29, 2024

ఆడపడుచులకు కెసిఆర్ అండ

- Advertisement -
- Advertisement -

పేదింటి ఆడపడుచులకు కల్యాణలక్ష్మి గొప్పవరం
ఇంటింటికీ కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే

KCR support women
మన తెలంగాణ / గద్వాల ప్రతినిధి : శుక్రవారం గ ద్వాల పట్టణంలోని బురదపేట, గంజిపేట, సుంకులమ్మ మెట్టు, భీమ్ నగర్, నది అగ్రహారం, సెకండ్ రైల్వే గేట్, జమ్మిచ్చేడు వార్డులలో లబ్థిదారుల ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి స్వయంగా లబ్థిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేశౠరు. గద్వాల పట్టణానికి సంబంధించిన 65మందికి కళ్యాణలక్ష్మి చెక్కులను రూ 65,07,540లు లబ్థ్దిదారుల ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే చేతులమీదుగా కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ స ందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వా లు చేయలేని విధంగా నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నారని తెలిపారు. ఉద్యమ సమయంలో పేద ప్రజల కష్టాలను తెలుసుకుని ఆడపిల్లలకు పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు ఇబ్బందులను తీసుకున్న నాయకుడుగా కల్యాణలక్ష్మి రూపంలో వారికి అండగా నిలుస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో గద్వాల పట్టణ ంలో మరింత అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించి గ ద్వాల పట్టణంలోని రూపురేఖలు మార్చే విధంగా కృషి చే యడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలోని గద్వాల పట్టణానికి ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్, ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు చెన్నయ్య, వ్యవసాయ మార్కెట్ చైర్‌పర్సన్ రామేశ్వరమ్మ, మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
సిఎం సహాయ నిధితో మెరుగైన వైద్యం

 గట్టు మండల పరిధిలోని చాగదోణ గ్రామానికి చెందిన కుమ్మరి నర్సింహులుకు 1 లక్ష 50వేల రూ. సిఎం సహనిధి లేటరును ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి జిల్లా క్యాంపు కార్యాలయంలో అందజేశారు.ఈ సందర్భగా ఎమ్మెల్యే మాట్లాడుతు సిఎం సహయనిధితో నిరుపేద ప్రజలకు మెరుగైన కార్పోరేట్ వైద్యం అందుతుందన్నారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రవేశ పెట్టే పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చేర్మన్ కేశవ్, ఎంపిపి విజయ్ కుమార్,మార్కెట్ యార్డు చేర్మన్ రామేశ్వరమ్మ,పార్టీ నేతలు బాబర్,కృష్ణమహేష్,శ్యామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News