Home తాజా వార్తలు తిమ్మాపూర్‌లో కెసిఆర్ పర్యటన

తిమ్మాపూర్‌లో కెసిఆర్ పర్యటన

CMKCRనిజామాబాద్ : తిమ్మాపూర్‌లోని గుట్ట శ్రీవేంకటేశ్వరస్వామిని తెలంగాణ సిఎం కెసిఆర్ దంపతులు దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న సుదర్శనయాగంలో శనివారం సిఎం కెసిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తిమ్మాపూర్ గట్టు ఆలయం అద్భుతంగా ఉందని, ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఆలయానికి రూ.10లక్షల 116లు విరాళం ప్రకటించారు. ఆలయ ప్రాంగణంలో రూ. 10 కోట్లతో కల్యాణ మండపం కట్టిస్తామని చెప్పారు. రాష్ట్రం ఏర్పడితే రూ.5కోట్లతో ఆభరణాలు తయారు చేయిస్తామని తిరుమల శ్రీవారికి మొక్కుకున్నాని, త్వరలో శ్రీవారి మొక్కు చెల్లించుకుంటానని కెసిఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.