Home వనపర్తి తెలంగాణలో… రైతులను విస్మరించిన కెసిఆర్

తెలంగాణలో… రైతులను విస్మరించిన కెసిఆర్

farmer-image

మన తెలంగాణ/వనపర్తి కలెక్టరేట్:గత ఎన్నికల ముందు రైతులను విస్మరించిన సిఎం కెసిఆర్ 2019 సార్వత్రిక ఎ న్నికల్లో గెలిచేందుకు ఇప్పుడు రైతు సంక్షేమానికై రైతు బంధు పథకాన్ని సిఎం కెసిఆర్ ప్రవేశ పెట్టారని ఎంఎల్‌ఎ డా.జి.చిన్నారెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం పేరుతో ఓటుకు నోటు మాది రిగా రైతుబంధు పథకాన్ని అమలు చేస్తుందని ఎంఎల్‌ఎ డా.జి.చిన్నారెడ్డి ఆరోపించారు. వనపర్తి పట్టణంలోని ఎం ఎల్‌ఎ నివాసంలో గురువారం విలేకరుల సమావేశం ఏ ర్పాటు చేశారు. ఈసందర్భంగా  ఎంఎల్‌ఎ డా. జి.చిన్నారెడ్డి మాట్లాడుతూ.. రైతాంగాన్ని ఆదుకొని చేరువ అ య్యేందుకు టిఆర్‌ఎస్  ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు. ఎన్నికల సమ యంలోనే ఈ పథకాన్ని అమలు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. స్థానిక ఎన్నికలు,అసెంబ్లీ ఎన్నికలు దగ్గరికి వస్తున్న సమయంలోనే ఈ రైతు బంధు పథకాన్ని సిఎం కెసిఆర్ అమలు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. వ్యవ సాయ బడ్జెట్ 2014  సంవత్సరంలో రైతులకు ప్రత్యేకంగా కెటాయించేది. గత 4 సంవత్సరాల నుండి రైతులపై, వ్యవసాయంపై ఎలాంటి దృష్టి కేంద్రీకరించలేక పోయారన్నారు. గతంలో సిఎం  రాజశేఖర్‌రెడ్డి ఉన్న సమయంలో వ్యవసాయ బ్యాంకర్లతో ప్రతి సంవత్సరం పాల్గొనే వారు. ఒక్క సంవత్సరం చేయాల్సిన రుణ మాఫిని 4 సంవత్సరాలుగా సాగదీయడం ఇది ఎంత వరకు సమంజసమని ఆయన అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంటర్‌వెన్సన్  2014 వరకు కొన సాగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం 60 శాతం , రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం ఇవ్వా ల్సి ఉండగా  గత 4  సంవత్సరాల నుండి 40 శాతం మాత్రమే రైతులకు అందజే యడం జరుగుతుందన్నారు.రైతుల ఆత్మహత్యలు3 వేలకు పైగా ఉన్నాయన్నా రు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులను నాయకులు పరామర్శించలేదన్నారు. తనకు సంబంధించిన 38 ఎకరాల రైతు బంధు పథకం చెక్కులను ఎంఎల్‌ఎ డా.జి.చిన్నారెడ్డి రూ.లక్షా 52వేలను పేదల సంక్షేమానికి అందజేయాలన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తైలం శంకర్,  తిరుపతయ్య, పట్టణాధ్యక్షులు కిరణ్ కుమార్ ,రాగివేణు, డిసిసి సహదేవ్, మాజి సర్పంచ్  జనార్ధన్, ఎండి బాబా, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.