Home తాజా వార్తలు ఎన్టిపిసి తెలంగాణ ప్రాజెక్టును సందర్శించిన సిఎం కెసిఆర్…

ఎన్టిపిసి తెలంగాణ ప్రాజెక్టును సందర్శించిన సిఎం కెసిఆర్…

 NTPC

 

గోదావరిఖని : ఎన్టిపిసి రామగుండం వద్ద నిర్మిస్తున్న ఎన్టిపిసి తెలంగాణ ప్రాజెక్టు మొదటి దశకు చెందిన 800 మెగావాట్ల రెండు విద్యుత్ యూనిట్ల నిర్మాణం పనులను ముఖ్యమంత్రి కెసిఆర్ శనివారం ప్రాజెక్టును సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. శనివారం సాయంత్రం తెలంగాణ ప్రాజెక్టులో జరుగుతున్న పనులను ఎన్టిపిసి సంస్థ సీఅండ్‌ఎండి గురుదీప్‌సింగ్, తెలంగాణ ప్రాజెక్టు సీజీఎం ప్రేంప్రకాష్‌లు సుమారు 45 నిమిషాల పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరించారు.

రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణకు ఎన్టిపిసి నుండి 4వేల మెగావాట్ల విద్యుత్‌ను అందించడంలో భాగంగా ఎన్టిపిసి రామగుండం వద్ద మొదటి దశలో 800 మెగావాట్లకు చెందిన రెండు విద్యుత్ యూనిట్లను 2016 డిసెంబర్ నెల నుండి ప్రారంభించిన వివరాలు. మొదటి దశ 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సరిపడు బొగ్గును ఒడిశాలోని మందాకిని బొగ్గుగని నుండి దీనికి సరిపడు రెండు టీఎంసీల నీటిని సమీప ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి దిగుమతి చేసుకోవడానికి ఒప్పందం కుదిరిందన్నారు.

ప్రాజెక్టు నిర్మాణం పనులు 80శాతం వరకు చేరుకున్నాయని, అలాంటివి సంబంధించిన అత్యంత కీలకమైన టర్బన్ జనరేట్, సీహెచ్‌పి కూలింగ్ టవర్‌లు, 270 మీటర్ల ఎత్తుగల చెమ్మితోపాటు అతి కీలకమైన పనులు వేగవంతంగా జరుగుతున్నాయని సీఎంకు వివరించారు. సీఎంతోపాటు తెలంగాణ జెన్‌కో సీఎండి ప్రభాకర్‌రావు, తెలంగాణ చీఫ్ సెక్రటరీ స్మితాసబర్వాల్, రాజీవ్‌శర్మ, మంత్రి కొపుల ఈశ్వర్, ఎన్టిపిసి ఆర్‌ఐడి దుబే, రామగుండం ఎన్టిపిసి ఈడీ కులకర్ణి, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, దాసరి మనోహర్‌రెడ్డి, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, పోలీస్ హౌసింగ్‌బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన, రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, అధికారులు, పోలీస్ సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.

KCR, who visited NTPC Telangana project