Home తాజా వార్తలు నాయీ బ్రాహ్మణుల సంక్షేమం కోసం కెసిఆర్ కృషి : జగదీశ్ రెడ్డి

నాయీ బ్రాహ్మణుల సంక్షేమం కోసం కెసిఆర్ కృషి : జగదీశ్ రెడ్డి

KCR Work For Welfare Of Nai Brahmins : Jagadish Reddyహైదరాబాద్‌ :  నాయీ బ్రాహ్మణుల సంక్షేమం కోసం తెలంగాణ సిఎం కెసిఆర్ ఎనలేని కృషి చేస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి తెలిపారు. మంగళవారం రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు రాసమల్ల బాలకృష్ణ, ఇతర నాయకులు హైదరాబాద్ లో మంత్రి జగదీశ్ రెడ్డిని కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. అణగారిన బడుగు వర్గాల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పాటుపడుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు రాసమల్ల బాలకృష్ణ మాట్లాడారు. కెసిఆర్ పాలనలో నాయీ బ్రాహ్మణులకు అన్ని విధాల న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. నాయీ బ్రాహ్మణులు నిర్వహించే సెలూన్లకు కెసిఆర్ ఉచిత విద్యుత్ సరఫరా చేయడం హర్షణీయమని ఆయన తెలిపారు. నాయీ బ్రాహ్మణులు కెసిఆర్ కు రుణపడి ఉంటారని ఆయన చెప్పారు. నాయీ బ్రాహ్మణులు టిఆర్ఎస్ కు, కెసిఆర్ కు సంపూర్ణ మద్ధతు ఇస్తున్నారని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో  ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గడల రాజు, విద్యాసాగర్, మంచికంటి కరుణాకర్‌తో పాటు సూర్యాపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జంపాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.