Home తాజా వార్తలు రైతులకు కెసిఆర్ కొత్త సంవత్సరం కానుక..

రైతులకు కెసిఆర్ కొత్త సంవత్సరం కానుక..

kcr
హైదరాబాద్: కొత్త సంవత్సరం కానుకగా రైతులకు సిఎం కెసిఆర్ కానుకను అందించనున్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరాపై ప్రగతి భవన్‌లో కెసిఆర్ సమీక్ష నిర్వహించారు. డిసెంబరు 31 రాత్రి 12.01 గంటల నుంచి 24 గంటల విద్యుత్ సరఫరా చేయనున్నట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. రైతుల మేలు కోసమే 24 గంటల కరెంటు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. సమైక్య రాష్ట్రంలో కరెంటు ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉండేదని అన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు కరెంటు అందుబాటులో ఉంటుందని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.