Home తాజా వార్తలు ప్రపంచకప్ కు ముందు టీమిండియాలో కలవరపాటు!

ప్రపంచకప్ కు ముందు టీమిండియాలో కలవరపాటు!

Team Indiaఇంగ్లండ్ ఆతిథ్యం ఇస్తున్న వన్డే ప్రపంచకప్ ఈ నెల 30న ప్రారంభం కానుంది. ఇప్పటికే టోర్నీలో పాల్గొనే దేశాలు తమ జట్లను ప్రకటించాయి. భారత్ కూడా 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. అయితే, వరల్డ్ కప్ కు ముందు టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. ప్రపంచకప్ కు ఎన్నికైన టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్, ఆల్ రౌండర్ కేదార్ జాదవ్ గాయపడటం కలవరపరుస్తోంది. ఆదివారం పంజాబ్ తో జరిగిన ఐపిఎల్ మ్యాచ్ లో చెన్నై తరఫున ఆడుతున్న  జాదవ్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపే క్రమంలో జాదవ్ భుజానికి గాయమైంది. దాంతో జాదవ్ ను మైదానం నుంచి స్ట్రేచర్ పై బయటకు తీసుకెళ్లారు.
Kedar Jadhavమ్యాచ్ అనంతరం దీనిపై చెన్నై ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడారు. కేదార్‌కి ప్రస్తుతం ఎక్స్-రే నిర్వహించామని, సోమవారం అతనికి పూర్తి వైద్య పరీక్షలు చేస్తారని తెలిపారు. జాదవ్ కోలుకుంటాడని కోరుకుంటున్న అని అన్నారు. మిగిలిన ఐపిఎల్ మ్యాచుల్లో అతన్ని ఇక ఆడించబోమన్నారు. గాయం తీవ్రం కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వరల్డ్ కప్‌ లాంటి మెగా టోర్నీ కోసం అతను ఫిట్‌గా ఉండటం ముఖ్యమని చెప్పుకొచ్చారు. అయితే, జాదవ్ కు అయిన గాయం అంత పెద్ద గాయంలా కనిపించడం లేదన్న ఆయన మంచి జరగాలనే జట్టు సభ్యులతో పాటు యాజమాన్యం కోరుకుంటుందని తెలిపారు. ఆల్ రౌండర్ గా రాణిస్తున్న జాదవ్ టీమిండియాకు దూరమైతే కొంత కష్టాల్లోపడినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ కేదార్ గాయం తీవ్రమైనదిగా తెలితే మాత్రం స్టాండ్‌-బేలో ఉన్న అంబటి రాయుడు లేదా రిషబ్ పంత్‌లలో ఒకరికి జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.
Kedar Jadhav Injury Scare India before World Cup 2019