Friday, April 19, 2024

గురువుతో కీర్తి లవ్ స్టోరి

- Advertisement -
- Advertisement -

 

‘మహానటి’ లాంటి క్లాసిక్ హిట్ తర్వాత టాలీవుడ్ కంటే కోలీవుడ్‌లోనే ఎక్కువ సినిమాలు చేసింది అందాల తార కీర్తిసురేష్. తెలుగులో అవకాశాలు వచ్చినా ఎందుకనో వదులుకుంది. ప్రస్తుతం మలయాళంలో మోహన్ లాల్ హిస్టారికల్ మూవీ ‘మరక్కర్’లో ఈ బ్యూటీ నటిస్తున్న సంగతి తెలిసిందే. మలయాళ భాషలోనే తొలిసారి 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న చిత్రమిది. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఇక ఈ సినిమాలో కీర్తిసురేష్ శాస్త్రీయ సంగీత కళాకారిణి ఆర్చ పాత్రలో కనిపించనుంది. శాస్త్రీయ సంగీతం నేర్చుకునే గురువుతో కీర్తి లవ్ స్టోరి స్పెషల్ గా ఉంటుందట. ఇక ఈ సినిమా కథాంశానికి వస్తే పోర్చుగీసు వారి దండయాత్రకు వ్యతిరేకంగా మలబార్ తీరాన్ని రక్షించడానికి వెళ్లిన కమాండర్ కుంజలి మరక్కర్ ఎలాంటి పోరాటం సాగించారు? అనే ఇతివృత్తంతో సినిమా సాగనుంది. ఈ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్నాడు. మంజు వారియర్, సునీల్ శెట్టి, అర్జున్ సరా, సుహాసిని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదే ఏడాది ఆగస్ట్ 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News