Friday, April 19, 2024

కీర్తికి బంపర్ ఆఫర్

- Advertisement -
- Advertisement -

పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ ఇటు రాజకీయాలతో పాటు అటు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడంలోనూ బిజీగా ఉన్నారు. ఇప్పటికే వేణు శ్రీరామ్, క్రిష్ సినిమాల షూటింగ్‌లలో ఆయన పాల్గొంటున్నారు. అయితే, క్రిష్ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనే దానిపై చాలా రోజుల నుంచి చర్చ జరుగుతోంది. మొత్తానికి హీరోయిన్ ఫైనల్ అయింది. జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్‌గా నటించనుంది. ‘అజ్ఞాతవాసి’లో ఆమె పవన్ సరసన నటించిన సంగతి తెలిసిందే. కాగా ఇదొక పిరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే చిత్రమని, ఇందులో పవన్ రాబిన్‌హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారనే వార్తలు వస్తున్నాయి. అన్నట్టు ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే పేరును అనుకుంటున్నారట. అయితే, చిత్ర బృందం నుండి మాత్రం ఇంకా ఎలాంటి అప్‌డేట్ వెలువడలేదు. ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Keerthi Suresh again act with Pawan Kalyan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News