Home గాసిప్స్ ‘ఆర్ ఆర్ ఆర్’లో కీర్తి సురేష్…?

‘ఆర్ ఆర్ ఆర్’లో కీర్తి సురేష్…?

Keerthy Suresh in RRR

హైదరాబాద్: ఒకప్పటి సీనియర్ కథనాయిక, మహానటి సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’లో నటించడంతో తమిళనటి కీర్తి సురేష్ పేరు ప్రఖ్యాతులు అమాంతం పెరిగిపోయిన సంగతి తెలిసిందే. తనదైన నటన, అభినయంతో కీర్తి ఈ మూవీలో నటించింది అనడం కంటే జీవించిందనడంలో సందేహం లేదు. అంతలా మహానటి పాత్రలో లీనమై ఆ పాత్రకు ప్రాణం పోసింది. దీంతో ఆమెకు బాగానే కలిసి వచ్చింది. ఆ ఒక్క  మూవీతో కీర్తి రాత్రికిరాత్రే  స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. అయితే, ఆమె ఈ చిత్రం తర్వాత తెలుగులో డైరెక్టుగా ఏ ఒక్క మూవీ కూడా ఒప్పుకోలేదు. కీర్తి ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేసుకుంటూ ప్లాన్డ్ గా వెళ్తోంది. ఇక ‘మహానటి’ తర్వాత తమిళంలో స్టార్ హీరోలైన విజయ్, విక్రమ్, విశాల్ సరసన వరుసగా సినిమాలు చేసింది. దీంతో తమిళంకు వెళ్లి బిజీ అయ్యింది. అయితే ప్రస్తుతం ఆమె దృష్టి తెలుగులో ఓ పెద్ద ప్రాజెక్టు మీద ఉందని తెలిసింది. అదే దర్శకధీరుడు రాజమౌళి టాలీవుడ్ టాప్ స్టార్స్ తారక్, రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ‘ఆర్ ఆర్ ఆర్’.

ఈ ప్రాజెక్టు కోసం కీర్తిని సంప్రదించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కానీ, భారీగా డేట్స్ కావాలనటంతో కీర్తికి ఉన్న ఇతర ప్రాజెక్టుల కమిట్మెంట్లకు సమస్య వచ్చే అవకాశం ఉండడంతో ఆలోచనలో పడ్డారట. సర్దుబాటు చేయగలిగితే ఈ చిత్రం చేయాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుతం వేరే మూవీలు ఏమీ అంగీకరించడం లేదట. ఇదే నిజమైతే కీర్తి పంట పండినట్లే అని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ భారీ ప్రాజెక్టులో చేస్తే ఆమె క్రేజ్ రెండింతలు కావడం ఖాయం. ఇక జక్కన్న తన సినిమాల్లో కథనాయికలను ఎంతటి ఇంపార్టెన్స్ ఇస్తారో తెలిసిందే. రాజమౌళి హీరోయిన్లకు ప్రాధన్యమిస్తూ ఎంత డెప్త్ గా క్యారక్టర్స్ ని డిజైన్ చేస్తారో మనకు తెలుసు. కాబట్టి ఈ సినిమాలో కనుక కీర్తి నటిస్తే మరో ‘మహానటి’లాంటి ప్రాజెక్టు అవుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. సో… ఈ రూమర్లు నిజం కావాలనే కొరుకుందాం. ఇక ఇటీవలె పూజా కార్యక్రమం జరుపుకున్న ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ఈ నెల 19 నుంచి రెగ్యూలర్ షూటింగ్ మొదలుకానుంది.

 Keerthy Suresh in Rajamouli’s RRR?

Telangana Breaking News