Home తాజా వార్తలు తేజ మూవీలో హీరోయిన్లుగా..

తేజ మూవీలో హీరోయిన్లుగా..

Keerthy suresh opposite to Gopichand

తేజ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ‘అలవేలుమంగ వెంకటరమణ’ అనే చిత్రం రూపొందబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని రాబోయే రెండు, మూడు నెలల్లో సెట్స్ పైకి తీసుకు వెళ్లేందుకు దర్శకుడు సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు ఉన్న ప్రాముఖ్యత నేపథ్యంలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ను సంప్రదించారట. కథ నచ్చడంతో కీర్తి సురేష్ ఈ చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పిందని తెలిసింది. మహేష్ బాబు, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్న ఈ భామ ఈ చిత్రానికి ఓకే చెప్పిందంటే ఆ కథ ఎంతగా ఆమెను ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ తో పాటు మరో హీరోయిన్ పాత్ర కోసం కళ్యాణి ప్రియదర్శన్ ను కూడా ఎంపిక చేసినట్లుగా తెలిసింది. గోపీచంద్‌కు జోడీగా వీరిద్దరు కనిపించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా గురించిన పూర్తి క్లారిటీని తేజ ఇచ్చే అవకాశం ఉంది.

Keerthy suresh opposite to Gopichand