Friday, March 29, 2024

అమెరికాలో నాగరాజు బినామీలు?

- Advertisement -
- Advertisement -

అక్కడ ఉంటున్న ఎంఆర్‌ఒ బంధువులు, ఓ స్నేహితుడి కుమారుడి ఆస్తుల దిశగా దర్యాప్తు 
రియల్టర్ అంజిరెడ్డి ఇంట్లో ఎంపి రేవంత్‌రెడ్డి ఎంపిలాడ్స్ పత్రాలు, ఆ కోణంలోనూ ఎసిబి అధికారుల విచారణ
సోదాల తర్వాత ఎంఆర్‌ఒ ఇంటికి బెంజ్ కారులో వచ్చిన ఆ నలుగురెవరు?

Keesara MRO Nagraj Arrest by ACB

మన తెలంగాణ/హైదారబాద్: కీసర ఎంఆర్‌ఒ నాగరాజు అక్రమాస్తులపై ఎసిబి అధికారుల దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. అమెరికాలో ఉంటున్న ముగ్గురు వ్యక్తులకు పేరిట ఆయన బినామీ ఆస్తులున్నట్లు తెలుస్తోంది. ఆదిశగా అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశా రు. ఎంఆర్‌ఒ సమీప బంధువులు, ఓ స్నే హితుని కుమారుడు అమెరికాలు ఉంటున్నా రు. అలాగే హైదరాబాద్‌లోని సదర్ బజార్ మార్వాడి, పాత రౌడీషీటర్‌లు ఎంఆర్‌ఒ నాగరాజు బినామీగా ఉన్నట్లు సమాచారం. ఇదిలావుండగా ఎసిబి అధికారులు ఎంఆర్‌ఒ ఇంట్లో సోదాల పూర్తి అయిన అనంతరం బెంజ్‌కారులో నాగరాజు ఇంటికి నలుగురు వ్యక్తులు వచ్చారని ఎసిబి అధికారులకు సమాచారం అందింది. దీంతో ఎంఆర్‌ఒ నాగరాజు ఇంటికి వచ్చిన నలుగురు వ్యక్తులు ఎవరన్న కోణంలో ఎసిబి అధికారులు వారిని ఆరా తీయడంతో పాటు గుర్తించే పనిలో పడింది. ఎంఆర్‌వొ నాగరాజు తన ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలను సదరు పాత రౌడీషీటర్‌కు చేరవేసినట్లు ఎసిబి అధికారులు అనుమానిస్తున్నారు. బినామీ ఆస్తుల పేరుతో నాగరాజు దాదాపు రూ.100కోట్ల మేరకు ఆస్తులు కూడబెట్టినట్లు ఎసిబికి సమాచారం అందినట్లు తెలుస్తోంది.
రియల్టర్ ఇంట్లో రేవంత్ ఎంపి లాడ్స్ ఫైళ్లు
అవినీతి తిమింగలం కీసర ఎంఆర్‌ఒ నాగరాజు కేసులో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. రియల్టర్ అంజిరెడ్డి ఇంట్లో ఎసిబి సోదాలలో ఎంపి రేవంత్‌రెడ్డి ఎంపి లాడ్స్ నిధుల ఫైళ్లు లభ్యమైనట్టు సమాచారం. ఎసిబికి పట్టుబడిన రియల్టర్ బ్రోకర్ అంజిరెడ్డి, రేవంత్‌కు సన్నిహిత సంబంధాలున్నట్టు దీని ద్వారా తెలుస్తోంది. రేవంత్‌వద్ద ఉండాల్సిన కీలక పత్రాలు రియల్టర్ వద్ద ఉండటంపైవిచారణ చేస్తున్నామని ఎసిబి తెలిపారు. కలెక్టర్ ఆఫీసులో ఉండాల్సిన పలు పత్రాలు అంజిరెడ్డి వద్ద లభ్యమమైనట్టు తెలిసింది. అంజిరెడ్డి ఇంట్లో స్వాధీనం చేసుకున్న కీలక పత్రాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నట్లు ఎసిబి అధికారులు అధికారులు వివరిస్తున్నారు.
భూ వివాదంపై ఎసిబి విచారణ
కీసర మండలం రాంపల్లి దాయరలో పట్టాదారు, కౌలుదారుల మధ్య భూ వివాదంలో కీలక ఆధారాలను సేకరించేందుకు ఎసిబి విచారణ చేపడుతోంది. 19 ఎకరాలకు సంబంధించిన వివాదంలో 8 ఎకరాలకు సంబంధించి పట్టాదారులకు అనుకూలంగా తీర్పు వచ్చిన పత్రాలను ఎసిబి అధికారులు పరిశీలిస్తున్నారు. ఆ భూమిని వారి పేరు మీదకు మార్చాల్సి ఉందని, ఆర్‌డిఒ పరిధిలో ఉన్న మరో 11 ఎకరాల వివాదంపై ఎసిబి విచారణ చేపడుతోంది. 8 ఎకరాలకు సంబంధించి రియల్‌ఎస్టేట్‌వ్యాపారులు తహసీల్దార్‌ను సంప్రదించి ఈ భూమిని పట్టాదారు ల పేర చేయాలని కోరినట్లు ఎసిబి గుర్తించింది. ఇందుకు ఎంఆర్‌వొ నాగరాజు రూ.2 కోట్లు డిమాండ్‌చేయడం, మేడ్చల్ కలెక్టర్ ద్వారా వెలువడాల్సిన డ్రాఫ్ట్ ఆర్డర్‌కాపీ, నోట్‌ఫైల్‌ను ఎంఆర్‌వొ తన ఆఫీస్‌లోనే తయారు చేసినట్లు ఎసిబి దర్యాప్తులో తేలింది. ఆ పత్రాలను తీసుకొని ఎంఆర్‌ఒ నాగరాజు రియల్టర్ కందాడి అంజిరెడ్డి గెస్ట్‌హౌస్‌కు వచ్చాడని, అప్పటికే రియల్టర్లు అంజిరెడ్డి, శ్రీనాథ్‌యాదవ్ రూ.1.10 కోట్లతో అక్కడ ఉన్నట్లు ఎసిబికి సమాచారంతో ఎంఆర్‌ఒ నాగరాజును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Keesara MRO Nagraj Arrest by ACB

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News