Home జాతీయ వార్తలు నాకు పెన్ను కొనుక్కునే అధికారమూ లేదు: కేజ్రీవాల్

నాకు పెన్ను కొనుక్కునే అధికారమూ లేదు: కేజ్రీవాల్

Kejriwal-Pm-Modiఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో చికున్ గున్యా, డెంగ్యూతో పలు వ్యాధులు ప్రబలుతుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఢిల్లీ ప్రభుత్వానికి ఎటువంటి అధికారాలు లేవని, పెన్ను కూడా కొనుక్కోడానికి వీల్లేదన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్, ప్రధానమంత్రి అన్ని అధికారాలను అనుభవిస్తున్నారు. గవర్నర్ విదేశాల్లో ఉన్నారు ఏమైనా ప్రశ్నించాలంటే వాళ్లని ప్రశ్నించండంటూ కేజ్రీవాల్ మంగళవారం ట్వీట్ చేశారు. ఢిల్లీ న్యాయశాఖ మంత్రి కపిల్ శర్మ మున్సిపల్ కార్పొరేషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దోమలు వ్యాప్తి చెందకుండా ఎంసిడి చర్యలు తీసుకోవాలని కపిల్ కోరారు. ఇప్పటి వరకు చికున్ గున్యా వల్ల నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో మొత్తం 1000 చికున్ గున్యా, 1100 డెంగ్యూ, 21 మలేరియా కేసులు నమోదయ్యాయి.