Home జాతీయ వార్తలు రాహుల్‌గాంధీపై కేజ్రీవాల్ విమర్శలు

రాహుల్‌గాంధీపై కేజ్రీవాల్ విమర్శలు

Arvindఢిల్లీ : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీపై ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు కురిపించారు. ఢిల్లీలోని రైల్వే స్థలాల ఆక్రమణల తొలగింపుపై ఆప్ ఎందుకు పార్లమెంట్ వద్ద గొడవ చేస్తోందని, ఢిల్లీలో అధికారంలో ఉన్నది వారే కదా అని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కేజ్రీవాల్ స్పందించారు. రాహుల్ చిన్న పిల్లాడని, అతడికి కనీసం రైల్వే శాఖ కేంద్ర ప్రభుత్వం కిందకు వస్తుందనే అంశం కూడా పార్టీ వారు నేర్పించినట్టు లేరని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. పశ్చిమ ఢిల్లీలోని షకూర్ బస్తీలో రైల్వే స్థలాల్లో ఉన్న సుమారు 1200 ఇళ్లను అధికారులు తొలగించారు. ఈ నేపథ్యంలో ఓ ఇంట్లో ఆరు నెలల పసి పాప రుకైయా మరణించిన విషయం తెలిసిందే. దీనిపై కేజ్రీవాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఈ ఘటనను నిరసిస్తూ పార్లమెంట్ ఎదుట ఆఫ్, టిఎంసి ఎంపిలు ఆందోళనకు దిగారు.