Home జాతీయ వార్తలు ప్రతి మహిళకు నెలకు రూ. 1000 : పంజాబీలకు కేజ్రీవాల్ హామీ

ప్రతి మహిళకు నెలకు రూ. 1000 : పంజాబీలకు కేజ్రీవాల్ హామీ

Kejriwal promises Rs 1000 per month to every 18+ woman

 

మోగా (పంజాబ్): వచ్చే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వస్తే పంజాబీ మహిళలు ఒక్కొక్కరి ఖాతాలో నెలకు రూ. 1000 వేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. 18 ఏళ్లు దాటిన మహిళలు అందరికీ ఇది వర్తిస్తుందని ఆయన వివరించారు. వృద్ధాప్య పెన్షన్ పొందుతున్న మహిళలకు కూడా అదనంగా ఈ రూ.1000 సాయం అందుతుందని వివరించారు. సోమవారం పంజాబ్ లోని మోగాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పంజాబ్‌లో తన రెండు రోజుల పర్యటనను ఆయన సోమవారం ప్రారంబించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మిషన్ పంజాబ్ కార్యక్రమం కింద ఆయన వచ్చేనెల పంజాబ్ లోని వివిధ ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించనున్నారు.

Kejriwal promises Rs 1000 per month to every 18+ woman