Friday, March 29, 2024

ఇతర కంపెనీలకూ కరోనా వ్యాక్సిన్ ఫార్ములా: కేంద్రానికి కేజ్రీవాల్ సలహా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్-19 వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచడానికి ఆ రెండు కంపెనీల వ్యాక్సిన్ల సంబంధించిన ఫార్ములాను ఇతర కంపెనీలకు కూడా కేంద్రం అందచేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సూచించారు. మంగళవారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వ్యాక్సిన్లకు కొరత ఏర్పడిందని చెప్పారు. దేశంలో వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సి ఉంటుందని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో దేశంలోని ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ జరిగేలా ఒక జాతీయ విధానాన్ని రూపొందించాల్సిన అవసరం కూడా ఉందని ఆయన సూచించారు. దేశంలో వ్యాక్సిన్‌ను తయారు చేసే అన్ని కంపెనీలు కొవిడ్ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసేందుకు వీలుగా కేంద్రం చర్యలు చేపట్టాలని ఆయన చెప్పారు. తమ వ్యాక్సిన్ ఫార్ములాను ఇతర కంపెనీలు ఉపయోగించుకున్నందుకు ఆ రెండు కొవిడ్ వ్యాక్సిన్ తయారీ సంస్థలకు రాయల్టీ లభించేలా చర్యలు తీసుకోవచ్చని ఆయన సూచించారు. కరోనా మూడవ వేవ్ ముంచుకొచ్చేలోగా దేశ ప్రజలందరికీ వ్యాక్సినేషన్ జరగాల్సిన అవసరం ఉందని, ఇందు కోసం దేశంలో కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి పెరగాలని ఆయన చెప్పారు.

Kejriwal suggests PM Modi to share vaccine formula

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News