Wednesday, April 24, 2024

గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

- Advertisement -
- Advertisement -

 

Kendra sahitya acadamy award to Goreti venkanna

హైదరాబాద్: ప్రముఖ కవి, శాసన మండలి సభ్యుడు గోరటి వెంకన్న కు ప్రతిష్టాత్మక ‘కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు – 2021’ దక్కడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ‘వల్లంకి తాళం’అనే కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు దక్కడం గొప్ప విషయమన్నారు. గోరెటి వెంకన్నకు ఈ సందర్బంగా ఆయనకు సిఎం కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

దైనందిన జీవితంలోని ప్రజా సమస్యలను సామాజిక తాత్వికతతో కండ్లకు కడుతూ వెంకన్న అందించిన సాహిత్యం ప్రపంచ మానవుని వేదనకు అద్దం పడుతుందని సిఎం కొనియాడారు. మానవ జీవితానికి, ప్రకృతికి వున్న అవినాభావ సంబంధాన్ని.. మనిషికి ఇతర జంతు పక్షి జీవాలకు వున్న అనుబంధాన్ని గోరటి వెంకన్న అత్యున్నతంగా ఆవిష్కరించారని సిఎం కొనియాడారు.
తెలంగాణ మట్టి వాసనలను తన సాహిత్యం ద్వారా గోరటి వెంకన్న విశ్వవ్యాపితం చేశారని సిఎం మెచ్చుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కవిగా తన సాహిత్యం ద్వారా గొప్ప పాత్ర పోషించారని తెలిపారు. గోరటి సాహిత్యానికి దక్కిన ప్రతిష్టాత్మక సాహితీ గౌరవం, తెలంగాణ మట్టి మనిషి జీవనతాత్వికకు దక్కిన గౌరవంగా సిఎం పేర్కొన్నారు.

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులకు తెలుగు భాష నుంచి మొత్తం 13 మంది పోటీపడగా గొరటిని వరించింది. ఈ అవార్డు ఎంపికలో తెలుగు జ్యూరీ సభ్యుల్లో డాక్టర్ మృణాళిని, జి శ్రీరామమూర్తి, డాక్టర్ కాత్యాయని విద్మహే ఉన్నారు. 20 భారతీయ భాషల్లో ప్రాచుర్యం పొందిన సాహిత్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ ఈ అవార్డులను ప్రకటిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News