Home అంతర్జాతీయ వార్తలు ఆ కేసులో నిందితులకు జైలు శిక్ష కాలం తగ్గించిన కోర్టు

ఆ కేసులో నిందితులకు జైలు శిక్ష కాలం తగ్గించిన కోర్టు

దంపతులు శ్యామ్-సోఫియా                                                        సోపియా లవర్ అరుణ్ 

 

మెల్‌బోర్న్: భార్య ప్రియుడితో కలిసి భర్తను చంపిన ఘటనలో మూడు సంవత్సరాలు జైలు శిక్ష తగ్గించిన సంఘటన ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగింది. కేరళకు చెందిన శ్యామ్ అబ్రహం, సోఫియా అనే దంపతులు తన ఆరేళ్ల కూతురితో కలిసి మెల్‌బోర్న్‌లో జీవిస్తున్నారు. సోఫియా మరో వ్యక్తి అరుణ్ కమలేశన్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయంపై శ్యామ్, సోఫియా మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. సోఫియా తన భర్తను చంపాలని ప్రియుడు అరుణ్‌కు చెప్పింది. ఒక రోజు కూల్ డ్రింక్‌లో పాయిజన్ కలిసి శ్యామ్‌కు సోఫియా ఇచ్చింది. దీంతో చనిపోయిన భర్తను ఆస్పత్రికి తీసుకెళ్లి గుండె వద్ద నొప్పి వస్తుందని చెప్పాడని వైద్యులకు భార్య తెలిపింది. పరీక్షించిన వైద్యులు శ్యామ్ మృతి చెందాడని పేర్కొన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహానికి శవ పరీక్ష నిర్వహించగా సైనైడ్ తీసుకొని చనిపోయాడని పోస్ట్ మార్టమ్‌లో తేలింది. దీంతో పోలీసులు తనదైన శైలిలో సోఫియా ప్రశ్నించగా జరిగిన విషయం మొత్తం చెప్పింది. దీంతో అరుణ్, ఆమె ప్రియుడు అరుణ్ అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. 2018లో కోర్టు వారికి 23 జైలు శిక్ష విధించింది. మళ్లీ అరుణ్ కోర్టులో పిటిషన్ వేయడంతో జైలు శిక్షను 20 సంవత్సరాలకు కుదించారు.

 

Kerala Man’s Murder in Australia: Sentence Reduced