Friday, March 29, 2024

కొత్త విద్యుత్ నియమాలను వ్యతిరేకిస్తున్న కేరళ!

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: విద్యుత్(సవరణ)నియమాలు 2022ను ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అది 2022 డిసెంబర్ 29న బయటికి వచ్చింది. కేరళ విద్యుత్ శాఖ మంత్రి కె.కృష్ణన్ కుట్టి వినియోగదారులపై భారం వేయకుండా ఎలా చూడొచ్చు అనే విషయంపై న్యాయ సలహా తీసుకుంటామన్నారు. కేరళ ప్రభుత్వం విద్యుత్(సవరణ) బిల్లులోని 14వ రూల్‌పై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది. ఆ రూల్ ప్రకారం విద్యుత్‌ను సరఫరా చేసే డిస్కామ్‌లు నెలవారీగా వినియోగదారుల నుంచి వివిధ రకాలుగా…ఫ్యూయల్ ప్రైస్, పవర్ పర్చేస్ కాస్ట్ కింద అదనంగా డబ్బు గుంజనున్నాయి.

డిస్కామ్‌లకు స్వేచ్ఛను ఇవ్వడమంటే వినియోగదారుల ప్రయోజనాలకు ఎసరు పెట్టడమేనని కేరళ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ సవరణ స్ధిరంగా ఉండని ధరలకు మార్గం సుగమం చేస్తుందని, అంటే, ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచినట్లు పెంచుకునేందుకు అవకాశం ఇస్తుందని వాదించింది. తరచూ ధరల హెచ్చుతగ్గులతో డిస్కాములు ఆడుకునేందుకు వీలుంటుందని పేర్కొంది. అంతేకాక స్టేట్ ఎలక్ట్రిక్ కమిషన్ ఫిక్స్ చేసిన సర్‌ఛార్జీ కూడా డైల్యూట్ అవుతుందన్నది. కేరళ విద్యుత్ శాఖ మంత్రి కె. కృష్ణమూర్తి న్యాయ సలహా తీసుకుని వినియోగదారులపై భారం పడకుండా చూస్తామన్నారు. ఇప్పటికే ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేస్ అడ్జెస్ట్‌మెంట్ సర్‌ఛార్జీలను కాల్యూకులేట్ చేసి వినియోగదారులకు నెలవారీగా వేస్తూనే ఉన్నారు. కేరళలో డిమాండ్‌లో ఉన్న విద్యుత్తులో 30 శాతం ఆ రాష్ట్రమే ఉత్పత్తి చేస్తోంది. ఎండాకాలంలో మాత్రం డిమాండ్ మేరకు కొంటుంది. కేరళ ప్రభుత్వం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తగు నిర్ణయం తీసుకోవాలనుకుంటోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News