Friday, March 29, 2024

ఆరోగ్యసూచీలో కేరళకు మొదటిస్థానం

- Advertisement -
- Advertisement -

Kerala ranks first in Health index:NITI Aayog

తెలంగాణకు మూడోస్థానం
యుపికి చివరి స్థానం
చిన్న రాష్ట్రాల్లో మిజోరంకు మొదటిస్థానం
నీతిఆయోగ్ నివేదిక

న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ ఆరోగ్యసూచీలో కేరళ మొదటిస్థానంలో, తమిళనాడు రెండోస్థానంలో, తెలంగాణ మూడోస్థానంలో నిలిచాయి. నాలుగోసారి కేరళ మొదటిస్థానంలో నిలిచింది. 201920 సంవత్సరానికి సంబంధించి ఆయా రాష్ట్రాల ఆరోగ్య సేవలతీరును తెలిపే ర్యాంకుల్ని నీతి ఆయోగ్ సోమవారం వెల్లడించింది. పెద్ద రాష్ట్రాల్లో ఉత్తర్‌ప్రదేశ్ చివరిస్థానంలో నిలిచింది. దాని తర్వాత అధ్వాన్నమైన స్థానాల్లో బీహార్ రెండోదిగా, మధ్యప్రదేశ్ మూడోదిగా నిలిచాయి. పురోగామి సూచీలో మాత్రం ఉత్తర్‌ప్రదేశ్ మొదటిస్థానంలో నిలిచింది. ఈ సూచీలోనూ తెలంగాణ మూడోస్థానంలో నిలిచింది. పురోగామి(సాపేక్ష) సూచీలో కేరళ 12వ స్థానంలో, తమిళనాడు 8వ స్థానంలో నిలిచాయి. పురోగామి సూచీని అంతకుముందు ఏడాదితో పోల్చి లెక్కిస్తారు. రెండు సూచీల్లోనూ రాజస్థాన్ కింది స్థానాల్లోనే నిలిచింది.

చిన్న రాష్ట్రాల్లో మొత్తమ్మీద మిజోరం మొదటిస్థానంలో, త్రిపుర రెండోస్థానంలో నిలిచాయి. కేంద్రపాలిత ప్రాంతాల్లో ఢిల్లీ,జమ్మూకాశ్మీర్ అధ్వాన్నస్థానాల్లో నిలిచాయి. అయితే, పురోగామి సూచీలో మొదటిస్థానాల్లో నిలిచాయి. మొత్తంమ్మీద లెక్కించడానికి 24 అంశాల్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఈ 24 అంశాలు మూడు విభాగాల్లో ఉంటాయి. అవి.. ప్రజల ఆరోగ్య పరిస్థితి, ప్రభుత్వం పనితీరు సమాచారం, కీలకమైన ఇన్‌పుట్స్‌కు సంబంధించిన ప్రక్రియ. రాష్ట్రాల ఆరోగ్య నివేదికను విడుదల చేసిన సందర్భంగా నీతిఆయోగ్ చైర్మన్ రాజీవ్‌కుమార్ మాట్లాడుతూ.. ఇది పోటీతో కూడిన సహకార సమాఖ్య విధానానికి నిదర్శనమన్నారు. నివేదిక రూపకల్పనలో ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమశాఖ కలిసి పని చేశాయి. ప్రపంచ బ్యాంక్ నుంచి సాంకేతిక సహకారం తీసుకున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News