Home తాజా వార్తలు చర్చల దిశగా…

చర్చల దిశగా…

Keshava Rao

మధ్యవర్తిత్వం వహిస్తా, విలీనం తప్ప ఇతర డిమాండ్లపై మాట్లాడుకుందాం : కెకె

పది రోజులుగా సాగుతున్న ఆర్‌టిసి సమ్మెపై చర్చలు జరుగుతాయన్న ఆశలు అంకురించాయి. ప్రభుత్వానికి, సమ్మెలోని కార్మికులకు మధ్యవర్తిత్వం వహిస్తానని, విలీనం తప్ప కార్మికుల ఇతర డిమాండ్లను ప్రభుతం పరిశీలించే విధంగా రాయబారం సాగిస్తానని, సమ్మె విరమింపజేసి నాయకులు తనతో సంప్రదించాలని టిఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు సోమవారం నుంచి ఢిల్లీ నుంచి చేసిన ప్రకటనకు ఆర్‌టిసి ఉద్యోగుల సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ కనీనర్ అశ్వత్థామరెడ్డి సానుకూలంగా సందించారు.

సమ్మెలతో సమస్యలు పరిష్కారం కావు, చర్చల ద్వారానే పరిష్కారమార్గాలు లభిస్తాయి… ప్రభుత్వంలో టిఎస్‌ఆర్‌టిసి విలీనం తప్ప కార్మికులు లేవనెత్తిన మిగతా డిమాండ్లను రాష్ట్రప్రభుత్వం పరిశీలించే విధంగా మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నాను. టిఎస్ ఆర్‌టిసిని ప్రైవేటీకరించే ప్రసక్తేలేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇటీవల తేల్చిచెప్పారు. ఆందుకు సిఎం కెసిఆర్‌ను అభినందిస్తున్నాను. ప్రభుత్వం గతంలో ఇతరరాష్ట్రాలకు ఆదర్శంగా ఆర్‌టిసి కార్మికుల సమస్యలను పరిష్కరించింది. 44 శాతం ఫిట్‌మెంట్,16 శాతం ఐఆర్ ఇచ్చిన ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుంది. అద్దె బస్సులు, ప్రైవేట్ స్టేజ్ క్యారేజ్‌ల విషయంలో సిఎం కెసిఆర్ చేసిన ప్రకటన ప్రస్తుత సమ్మె నేపథ్యంలో తీసుకున్న నిర్ణయంగామాత్రమే చూడాలి.

మన తెలంగాణ/హైదరాబాద్: టిఎస్ ఆర్‌టిసి కార్మికుల సమ్మె పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహించేందుకు తా ను సిద్ధంగా ఉన్నానని ఢిల్లీ నుంచి టిఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు ఒకప్రకటనలో తెలిపారు. టిఎస్ ఆర్‌టిసి కార్మికులు తనతో సంప్రదింపులు జరిపితే మ ధ్యవర్తిత్వం వహించి ప్రభుత్వంతో చర్చ లు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు కెకె ఆర్టీసి కార్మికులకు హామీ ఇచ్చారు. టిఎస్ ఆర్‌టిసి కార్మికుల సమ్మె, సమస్యలు, పరిష్కారాలపై తాను ప్రభుత్వంతో చర్చలు జరిపి కార్మికులకు న్యాయం చేయనున్న ట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో టిఎస్ ఆర్‌టిసి నాయకులు తమఅభిప్రాయాలను తెలియచేయాలని కెకె విజ్ఞప్తి చేశారు. స మ్మెలతో సమస్యలు పరిష్కారం కావనీ, చ ర్చల ద్వానే పరిష్కారమార్గాలు లభిస్తాయ ని కేశవరావు ఆర్‌టిసి జెఏసి నాయకులకు సూచించారు. టిఎస్ ఆర్‌టిసి సమ్మె పై సోమవారం ఢిల్లీ నుంచి టిఆర్‌ఎస్ సెక్రటరీజనరల్, రాజ్యసభలో టిఆర్‌ఎస్ పక్ష నాయకుడు కె.కేశవరావు ఒకప్రకట న విడుదల చేశారు.

టిఎస్ ఆర్‌టిసి కార్మికుల ఆత్మహత్యలు నన్ను బాధించాయి. ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కా దు, పరిస్థితులు చేదాటిపోకముందే ఆర్‌టిసి యూనియన్ నేతలు సమ్మె విరమింపజేసి చర్చలకు సిద్ధంకావాలని ఆయన కో రారు. ప్రభుత్వంలో టిఎస్‌ఆర్‌టిసి విలీ నం తప్ప కార్మికులు లేవనెత్తిన మిగతా డి మాండ్లను రాష్ట్రప్రభుత్వం పరిశీలించే విధంగా తాను మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఆర్‌టిసి కార్మికుల సమస్యలను రాష్ట్రప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని పేర్కొన్నారు. టిఎస్ ఆర్‌టిసిని ప్రైవేటీకరించే ప్రసక్తేలేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇటీవల తేల్చిచెప్పారు. ఆందుకు సిఎం కెసిఆర్‌ను అభినందిస్తున్నాను. ప్రభుత్వం గతంలో ఇతరరాష్ట్రాలకు ఆదర్శంగా అర్‌టిసి కార్మికుల సమస్యలను పరిష్కరించిందని ఆయన గుర్తుచేశారు.
44 శాతం ఫిట్‌మెంట్,16 శాతం ఐఆర్ ఇచ్చిన ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అయితే అద్దె బస్సులు, ప్రైవేట్ స్టేజ్ క్యారేజ్‌ల విషయంలో సిఎం కెసిఆర్ చేసిన ప్రకటన ప్రస్తుత సమ్మెనేపథ్యంలో తీసుకున్న నిర్ణయంగామాత్రమే చూడాలని టిఎస్‌ఆర్‌టిసి నాయకులకు కెకె చెప్పారు. 2018 ఎన్నికల టిఆర్‌ఎస్ మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్‌గా ఉన్న నాకు అనేక విషయాలు,ప్రజల డిమాండ్లు, రాష్ట్రాభివృద్ధిపై పూర్తి అవగాహన ఉంది. టిఎస్ ఆర్‌టిసిని ప్రభుత్వంలో కలిపే ప్రతిపాదన టిఆర్‌ఎస్ ఎన్నికలప్రణాళికలో లేదు. అర్‌టిసి ఏకాదు ఏ ప్రభుత్వరంగసంస్థలను ప్రభుత్వంలో విలీనం చేయాలనే అంశాలను ఎన్నికల ప్రణాళికలో చేర్చలేదు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేయడమంటే ప్రభుత్వ పాలసీని మార్చ్తుకోవడమే అవుతుందన్నారు. ఈ అంశం టిఎస్ ఆర్‌టిసి యూనియన్లకు అవసరంలేదు. మరోసారి స్పష్టం చేస్తున్నాను టిఎస్ ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం అంశం చేసే మినహా ఇతర న్యాయమైన డిమాండ్లు, అంశాలపై తాను మధ్యవర్తిత్వం వహించి ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్దంగా ఉన్నాను, ఆర్‌టిసి కార్మికులు ఆవేశాలకు, ఆత్మహత్యలకు వెళ్లకుండా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని కోరుతున్నట్లు కెశవరావు విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీనుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన కెకె
టిఎస్ ఆర్‌టిసి సమ్మెకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వంతో మధ్యవర్తిత్వం వహించేందుకు ముందుకువచ్చిన కెకెను టిఎస్ ఆర్‌టిసి కార్మికులు, నాయకులు ఫోన్ ద్వారా స్వాగతించారు. కొంతమంది నాయకులు తమ అభిప్రాయాలను, డిమాండ్లను, సమ్మెవివరాలను కెకెకు వివరించారు. ప్రభుత్వంతో చర్చలు జరిపి సమస్యలకు పరిష్కారం చూపాలని కెకెను ఆహ్వానించడంతో నేడు ఉదయం ఢిల్లీ నుంచి టిఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్, రాజ్యసభలో టిఆర్‌ఎస్ పక్ష నేత కె.కేశవరావు హైదరాబాద్‌కు రానున్నారు. టిఎస్ ఆర్‌టిసి నాయకుల ఆహ్వానం మేరకు వారితో చర్చలు జరిపి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లనున్నారు. అయితే టిఎస్ ఆర్‌టిసిలో మరికొన్నివర్గాలు కెకె ఆహ్వానానికి ఏమేరకు స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉంది.

Keshava Rao urges RTC Workers to end strike