Tuesday, November 29, 2022

నేను కూడా నిజ జీవితంలో అంతే

- Advertisement -

Ketika sharma interview about lakshya movie

 

నాగశౌర్య హీరోగా కేతిక శర్మ హీరోయిన్‌గా స్పోర్ట్ డ్రామా నేపథ్యంలో రాబోతోన్న చిత్రం ‘లక్ష్య’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ కేతిక శర్మ మీడియాతో మాట్లాడుతూ చెప్పిన విశేషాలు…

నటనలో వైవిధ్యాన్ని చూపించాలని…
‘రొమాంటిక్’ సినిమా షూటింగ్ చివరి రోజున దర్శకుడు సంతోష్ కలిసి ఈ సినిమా కథ చెప్పారు. అదే రోజు ఓ సినిమా షూట్ పూర్తవడం, ఇలా వెంటనే మరో కథ రావడం ఆనందంగా అనిపించింది. రొమాంటిక్ చిత్రంలో చేసిన పాత్రకు, లక్ష్య సినిమాలో చేసిన క్యారెక్టర్‌కు సంబంధం ఉండదు. నా నటనలోని వైవిధ్యాన్ని చూపించాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను ఒప్పుకున్నాను.
పక్కింటి అమ్మాయిలా…
లక్ష్య సినిమాలో రితిక పాత్రను పోషించాను. ఆమె తన మనసుకు ఏమనిపిస్తే అదే చేస్తుంది. నేను కూడా నిజ జీవితంలో అంతే. కానీ రితికలా పెళ్లి గురించి మాత్రం ఎక్కువగా ఆలోచించను. నాలాంటి వాళ్లను భరించడం కష్టం. ఇక ఈ చిత్రంలో నేను పక్కింటి అమ్మాయిలా కనిపిస్తాను. లక్ష్య చిత్రం పార్థు చుట్టూ తిరుగుతుంది. అతన్ని ప్రేమించే పాత్రలో రితిక కనిపిస్తుంది.
అన్ని రకాల ఎమోషన్స్…
నాకు స్పోర్ట్స్ అంటే ఇష్టం. నేను స్టేట్ లెవెల్ స్విమ్మర్, మా అమ్మ నేషనల్ లెవెల్ స్విమ్మర్. నాకు స్విమ్మింగ్ బేస్డ్ సినిమా వస్తే చేస్తాను. ఈ చిత్రంలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. నాగ శౌర్య అద్భుతంగా నటించారు. నా క్యారెక్టర్ ఎమోషనల్‌గా ఉంటుంది. ఇక ఆర్చరీ మీద ఇంతవరకు సినిమాలు రాలేదు. అదే నాకు ఆసక్తికరంగా అనిపించింది. అందుకే ఈ సినిమాను చేయాలనిపించింది.
తదుపరి చిత్రాలు…
ప్రస్తుతం నా మూడో ప్రాజెక్ట్ వైష్ణవ్ తేజ్‌తో చేస్తున్నాను. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. అదొక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఈ చిత్రం కాలేజీ, ప్రేమ చుట్టూ తిరుగుతుంది.

Ketika sharma interview about lakshya movie

Related Articles

- Advertisement -

Latest Articles