Tuesday, March 21, 2023

కీలక కేసులు రాజ్యాంగ పీఠానికి

- Advertisement -

court

*ప్రస్తుత సంక్షోభం తొలగే వరకు అప్పగించాలి  *తిరుగుబాటు న్యాయమూర్తుల వాదనను సమర్ధిస్తూ సిజెకి నలుగురు మాజీల లేఖ  *చలమేశ్వర్‌ను కలిసిన బార్ కౌన్సిల్ బృందం  

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో పాలనా వ్యవహారాలు సక్రమంగా లేవంటూ నలుగురు సీనియర్ న్యాయమూర్తులు మీడియా ముందుకు వచ్చి సంచలనం సృష్టించిన నేపథ్యంలో వారు లేవనెత్తిన అంశాలతో తామూ ఏకీభవిస్తున్నామని ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి సహా నలుగురు రిటైర్డ్ న్యాయమూర్తులు ఆదివారం బహిరంగ లేఖ రాశారు. సుప్రీంకోర్టు సంక్షోభాన్ని న్యాయవ్యవస్థ పరిధిలోనే పరిష్కరించాల్సి ఉందని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సావంత్, ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎపి షా, మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి కె చంద్రు, బొంబాయి హైకోర్టు మాజీ న్యాయమూర్తి హెచ్. సురేశ్‌లు బహిరంగ లేఖ రాసిన వారిలో ఉన్నారు. ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇతర న్యాయమూర్తులతో కలిసి తాము బహిరంగ లేఖ రాశామని జస్టిస్ షా ధ్రువీకరించారు. లేఖలో పేర్కొన్న న్యాయమూర్తులు అంతా అంగీకరించారని ఆయన మీడియాకు తెలిపారు. ఈ సంక్షోభం పరిష్కారమయ్యేంత వరకు ముఖ్యమైన కేసుల జాబితాను ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ముందుంచాలన్న సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్(ఎస్‌పిబిఎ) అభిప్రాయాలతో రిటైర్డ్ న్యాయమూర్తుల అభిప్రాయాలకు పోలి ఉన్నాయని జస్టిస్ షా పేర్కొన్నారు. బహిరంగ లేఖకు మిగతా న్యాయమూర్తులు అంగీకరిస్తారో లేదోనని తాను మొదట భావించానని,ఇప్పుడు వారు సమ్మతించారని ఆయన తెలిపారు.
సుప్రీంకోర్టులోని వివిధ ధర్మాసనాలకు సున్నితమైన కేసుల కేటాయింపుకులకు సంబంధించి నలుగురు సీనియర్ దిగువ స్థాయి న్యాయమూర్తులు ముఖ్యమైన అంశాలను లేవనెత్తారని ఆ లేఖలో పేర్కొన్నారు. కేసుల కేటాయింపు తీరు సరైన విధంగా లేదని, ప్రత్యేకంగా ఎంపిక చేసిన ధర్మాసనాలకు కేటాస్తున్నారని న్యాయమూర్తులు ఆరోపించారన్నారు. జూనియర్ న్యాయమూర్తులు నాయకత్వంలోని ధర్మాసనాలకు మధ్యవర్తిత్వ పద్ధతిలో తరుచుగా కేసుల కేటాయింపు జరుగుతోందని తెలిపారన్నారు. ఈ దోరణి న్యాయ పాలన, న్యాయశాస్త్ర నియమాలకు ప్రమాదకరమని న్యాయమూర్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారని లేఖలో పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల అభిప్రాయాలతో తాము ఏకీభవిస్తున్నామని నలుగురు రిటైర్ న్యాయమూర్తులు పేర్కొన్నారు. కేసులను రోస్టర్ పద్ధతిలో తగిన ధర్మాసనానికి కేటాయింపునకు సంబంధించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అధికారం ఉన్నప్పటికీ, సున్నిత, ముఖ్యమైన కేసులను మధ్యవర్తిత్వ పద్ధతిలో జూనియర్ న్యాయమూర్తులు న్న ధర్మాసనాలకు కేటాయించాలని కాదన్నారు. సుప్రీంకోర్టులో వివిధ ధర్మాసనాలకు కేసుల పంపిణీ, కేటాయింపునకు సంబంధించి స్పష్టమైన నియమ, నిబంధనలు కచ్చితంగా రూపొందించాలని రిటైర్డ్ నాయమూర్తులు పేర్కొన్నారు. న్యాయవ్యవస్థపై ప్రజలకు విశ్వాసం కలిగేందుకు కేసుల కేటాయింపు హేతుబద్ధంగా, సరైన పద్ధతిలో, పారదర్శకంగా జరగాలని పేర్కొన్నారు.
పెండింగ్ కేసులతో సహా సున్నిత, ముఖ్యమైన కేసులను ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మాత్రమే విచారణ చేపట్టాలని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే ఎలాంటి పక్షపాతం లేకుండా సుప్రీంకోర్టు పారదర్శకంగా పని చేస్తోందని ప్రజలకు విశ్వాసం పెరుగుందన్నారు. సున్నితమైన, ముఖ్యమైన కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రోస్టర్ పద్ధతిని దుర్వినియోగం చేయడం జరగదన్నారు. ఈ సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని తమలేఖలో రిటైర్డ్ న్యాయమూర్తులు అభ్యర్థించారు.
జస్టిస్ చలమేశ్వర్‌ను కలిసిన బార్ కౌన్సిల్ బృందం: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నలుగురు సీనియర్ న్యాయమూర్తుల మధ్య నెలకొన్న వివాద పరిష్కారానికి బార్ కౌన్సిల్ చర్యలు ప్రారంభించింది. దీనికోసం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బిసిఐ) చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా నాయకత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం జస్టిస్ చలమేశ్వర్‌ను ఆయన నివాసానికి వెళ్లి కలిసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తమ మధ్య నెలకొన్న సమస్యలను అంతర్గతగా, రాజ్యాంగ పరిధిలో పరిష్కరించుకోవాలని శనివారం బార్ కౌన్సిల్ సూచించిన విషయం తెలిసింది.
అయితే న్యాయమూర్తుల మధ్య ఏర్పడిన వివాదాన్ని ఫుల్ కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలని బార్ అసోసియేషన్ పేర్కొంది. రెండ్రోజుల క్రితం సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ కోర్, జస్టిస్ జోషప్ కురియన్ అత్యున్నత న్యాయస్థానంలో కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ మీడియా ముందు కొచ్చిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News