Home తాజా వార్తలు బంగారానికి చెల్లి ఉల్లి

బంగారానికి చెల్లి ఉల్లి

Onion

 

కిలో @ 110

హైదరాబాద్ : క్వింటాల్ ఉల్లి ధర రూ.11,000కు చేరింది. కేజీ ఉల్లి రూ.110కి చేరినట్లైంది. తెలుగు రాష్ట్రాలలో ఉల్లి ధర ఈ విధంగా ఉంటే.. దేశ రాజధాని ఢిల్లీ లో కిలో ఉల్లి రూ.100 నుంచి రూ.500 వరకు ఉందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మార్కెట్‌లో ఉల్లి లేదు. ప్రజల వద్ద అంత ధర పెట్టి కొనేందుకు డబ్బు లేదు. దీంతో కేంద్రమే ఉల్లి ధరను దించడానికి సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ఉల్లి కొరతను నివారించేందుకు ఇతర దేశాల ను ంచి దిగుమతి చేసుకుంటామని కేంద్రం ప్రకటించింది. దిగుమతి చేసుకున్న ఉల్లినే కాకుండా దేశీయంగా లభించే ఉల్లిని సైతం ప్రజల కోసం ప్రత్యే క విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. ఉల్లిని అమ్మేందుకు పంపిణీ పాయి ంట్లు, రైతు బజార్‌ల వద్ద తక్కువ ధరకు దొరికేలా చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.

ఈ మేరకు కొన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకుని రైతు బజార్‌ల ద్వారా తక్కువ ధరకు ఉల్లి విక్రయించే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టా యి. ఇదే సమయంలో ఆయా రాష్టాల్లో ఉల్లి ఎంత సరఫరా అవుతోంది. ఉల్లి ధరలెలా ఉన్నాయి, ని ల్వలో ఉన్న ఉల్లి ఎంత అనే విషయాలను కేంద్రం ఆరా తీసినట్లు సమాచారం. ఇదే సందర్భంలో అక్రమంగా ఉల్లిని నిల్వ ఉంచుకుని అధిక ధరలకు అమ్మేవారిని కనిబెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహారాష్ట్ర నుంచి అధిక ఉల్లి ఉత్పత్తి అవుతోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల వల్ల ఆ రాష్ట్రంలోనూ ఉల్లి ఉత్పత్తితో పాటు సరఫరా కూడా తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో ఉల్లి ధరలను అదుపు చేసేందుకు ఏకంగా కేంద్ర హోంమ్రంతి అమిత్‌షా నేతృత్వంలోనే ప్రత్యేక బృందం ఏర్పాటైంది.

ఈ బృందం ప్రభుత్వం తరపున మొత్తం 1.2 లక్షల టన్నుల ఉల్లిని దిగుమతి చేయాలని స్పష్టంచేసింది. హోంమంత్రి అమిత్‌షాతో పాటు ఈ కమిటీలో ఆర్థిక, రవాణా, వ్యవసాయ శాఖ మంత్రులు సభ్యులుగా ఉన్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో ఉల్లి వంద రూపాయలు దాటిపోవడంతో ఉల్లిని దిగుమతి చేయాలని చెప్పారు. ఉల్లిని ఇతర దేశాలకు ఎగుమతులు చేయకుండా ప్రభుత్వం నిషేధం విధించింది. విదేశాల నుంచి దిగుమతి అయ్యే ఉల్లిని ఎంపిక చేసిన కేంద్రాల్లో కిలో రూ.60లకే విక్రయించనున్నారు. అయితే ఉల్లి దెబ్బకు ప్రభుత్వాలే పడిన సందర్భాలు లేకపోలేదు. మరోవైపు పెరుగుతున్న ఉల్లి ధరలతో ఉల్లి లేనిదే మింగుడుపడని సామాన్యుడు మాత్రం ఉల్లి ధరలు ఎప్పటికీ సాధారణ స్థితికి చేరుతాయోనని ఎదురు చూసే పరిస్థితి నెలకొని ఉందంటే అతిశయోక్తి కాదు.

Kg Onion rose to Rs 110