Home మెదక్ టిఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే ఖేడ్ అభివృద్ధి

టిఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే ఖేడ్ అభివృద్ధి

Harish-rao1మన తెలంగాణ, నారాయణఖేడ్/కల్హేర్/కంగ్టి: ఇంట్లో ఒక్కడినై ప్రజాభివృద్ధికి ప్రభుత్వం తరపున ఖేడ్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఖేడ్ ఉప ఎన్నికల ప్రచార పర్యటనలో భాగంగా బుధవారం నారాయణఖేడ్ మండలంలోని తుర్కాపల్లి, తుర్కాపల్లితండా, ర్యాకల్, గంగాపూర్, కల్హేర్ మండలంలోని సిర్గాపూర్, కంగ్టి మండలంలోని చీమల్‌పాడ్, సంగెంతో పాటు ఆయా గ్రామాల్లో పర్యటించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే ఖేడ్ నియోజ కవర్గం అభివృద్ధి చెందిందని, 60ఏళ్ల పాలనలో  ఖేడ్ నియోజకవర్గానికి స్వాతంత్య్రం రాలేదని, టిఆర్‌ఎస్ అభివృద్ధితోనే స్వాతంత్య్రం వచ్చిందన్నారు. భావితరాల భవిష్యత్ అభివృద్ధికి బంగారుబాటను వేసుకు నే అవకాశం ఖేడ్ నియోజకవర్గ ప్రజల చేతుల్లో ఉందన్నారు. విద్యుత్, విద్యా, రహదారుల అభివృద్ధి, మంచినీటి సౌకర్యంతో పాటు మరెన్నో ఇబ్బందులను తీర్చేందుకు ఇప్పటికే ఖేడ్ నియోజ కవర్గంలో ముమ్మర అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందన్నారు. నీల్లు లేక అనేక గ్రామాలు, తండాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఏళ్ల తరబడి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి ఇదేనా అని ప్రశ్నించారు. అభివృద్ధి రోజులు దగ్గర ఉన్నాయని, ఖేడ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే కారుగుర్తుకు ఓటు వేసి భూపాల్‌రెడ్డిని గెలిపించాలని కోరారు.
నీళ్లు, రోడ్లు లేక పెళ్లిళ్లు కావడం లేదు
తెలంగాణ రాష్ట్రంలో మరెక్కడ లేని విధంగా ఖేడ్ నియోజకవర్గంలోని మనూరు, కంగ్టి మండలాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉండడంతో పాటు మట్టి రోడ్లకు నోచుకోని గ్రామాలు ఉన్నాయన్నారు. అలాంటి గ్రా మాలకు పిల్లను ఇవ్వడం లేదన్నారు. కిలోమీటర్ల తరబడి నుంచి నీళ్లు తెచ్చుకోవడం, మట్టి రోడ్లపై నడవడంతో గ్రామాలకు వెళ్లలేని దుస్థితి నెలకొనగా ఆపదలో 108 రావడానికి ఇబ్బందికరంగా ఉందన్నారు. ఈ పాపం ముమ్మటికీ కాంగ్రెస్ నాయకులదేనన్నారు. కంగ్టి మండలంలోని బోర్గితో పాటు పలు తండాల్లో, మనూరు మండలంలోని ఎర్రబొగుడ, మోర్గితో పాటు పలు గ్రామాలు, తండా లు ఈ దుస్థితిలో ఉన్నాయన్నారు. ఎన్నికల సమయంలో పటేళ్ల ఇంట్లో ముచ్చటించి కల్లు, సారా సీసా ల లెక్కలు చూసుకునేవారని, కాంగ్రెస్ నాయకులు అభివృద్ధిని మరిచారన్నారు. ఎదురు ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేయించి బెదిరింపులకు గురిచేసి గుండా రాజకీయాలు చేశారన్నా రు. అయితే టిఆర్‌ఎస్ పాలనలో అలాంటిది ఉండదని, పట్టపగలు ప్రచారం చేసి ఓటు అడుగు తామన్నారు. వలస వెళ్ల్లి కర్ణాటక రాష్ట్రంలో, ఇతర ప్రాంతాల్లో ప్రమాదవశాత్తు మృతిచెందిన సంఘటనలను గుర్తు చేశారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటా తాగునీరు అందజేసి, అక్కాచెల్లెల్ల కష్టాలను తీర్చేందుకు సిఎం కెసిఆర్ ముమ్మరంగా కృషి చేస్తున్నారు. కల్యాణలక్ష్మీ, షాదిముబారక్, సన్నబియ్యం, ఆసర పథకాలు ప్రవేశ పెట్టి పెద్ద కొడుకు వలే కేసీఆర్ పేద కుటుంబాలను ఆదుకుం టున్నారన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో విద్యుత్ సబ్‌స్టేషన్లు, మార్కెట్‌యా ర్డులు, రహదారుల అభివృద్ధి చేయడంతో పాటు ఖేడ్ పట్టణంలో వెలుగులు నింపామన్నారు. ఖేడ్ దశ-దిశ మారుస్తున్న ప్రభుత్వాన్ని ఆదరించాలని భూపాల్‌రెడ్డిని గెలిపించేందుకు కారుగుర్తుకు ఓటు వేయాలన్నారు.
అభివృద్ధిని చూసి ఆదరించండి : భూపాల్‌రెడ్డి
అభివృద్ధిని చూసి ఆదరించి కారుగుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలపించాలని టిఆర్‌ఎస్ అభ్యర్థి భూపాల్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఖేడ్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని అభివృద్ధిబాటలో కొనసాగిస్తూ మనలో ఒకడిగా సమస్యలను తీరుస్తున్నారన్నారు. వారి అడుగుజాడల్లో నడుచుకుని మీ సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరారు. భావితరాల భవిష్యత్తుకు బంగారుబాట వేసుకునే అవకాశం మీ చేతుల్లో ఉందని, కారుగుర్తుకు ఓటు వేసి తనను గెలిపిస్తే సేవ చేసి ఖేడ్ నియోజకవర్గ ప్రజల రుణం తీసుకుంటానన్నారు.
ఆయా గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఎంపి బిబి పాటిల్, సంగారెడ్డి, అందోల్, జూకల్ ఎమ్మెల్యేలు చింత్రా ప్రభాకర్, బాబూమోహన్, హనుమంత్‌షిండే,మాజీ ఎమ్మెల్యే కిషన్‌సింగ్, లింగాయత్ సమాజ్ రాష్ట్ర అధ్యక్షులు బిడెకన్నె హన్మంతు, జడ్పిటిసి రవికుమార్, వినోద్‌పాటిల్ తదితరులు పాల్గొన్నారు.