Home తాజా వార్తలు ప్రారంభమైన ఖైరతాబాద్ గణపతి శోభాయాత్ర

ప్రారంభమైన ఖైరతాబాద్ గణపతి శోభాయాత్ర

 

హైదరాబాద్: వినాయక నిమజ్జనం సందర్భంగా ఖైరతాబాద్ శ్రీద్వాదశాదిత్య మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది.  భారీ క్రేన్‌ సాయంతో ట్రక్కుపైకి విగ్రహాన్ని ఎక్కించారు. గణపతి శోభాయాత్ర ప్రారంభం కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు.  ఎన్టీఆర్ మార్గ్‌లో ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర కొనసాగనుంది. మహాగణపతిని మధ్యహ్నం 1గంటలోపే నిమజ్జనం చేసేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. హుస్సేన్ సాగర్లో మహా గణపతిని సంపూర్ణంగా నిమజ్జనం చేసేందుకు క్రేన్ నెంబర్ 6 దగ్గర 20 ఫీట్లకు పైగా లోతు పెంచినట్లు జిహెచ్‌ఎంసి తెలిపింది. ఉదయం 6 గంటల నుంచే హుస్సేన్ సాగర్ వద్ద గణనాథుల రాకతో నగరంలో సందడి వాతారవణం నెలకుంది. అయితే పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. అయినప్పటికీ వర్షం మధ్యే విగ్రహాల నిమజ్జనం కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు గణేష్ నిమజ్జనం కొనసాగనున్న నేపథ్యంలో నగరంలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

కాగా, వినాయక నిమజ్జనం సందర్భంగా జంట నగరాలైన హైదరాబాద్-సికింద్రాబాద్‌లతో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో గురువారం సాధారణ సెలవును ప్రకటించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి ఉత్తర్వులను జారీ చేశారు.

Khairatabad Ganesh shobha Yatra Started