Home ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చిన అడిషనల్ కలెక్టర్..

ప్రభుత్వ ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చిన అడిషనల్ కలెక్టర్..

Khammam Additional Collector blessed baby girl in Govt Hospital

ఖమ్మం: జిల్లా అడిషనల్ కలెక్టర్ స్నేహలత ప్రభుత్వ ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది. నిన్న పురిటి నొప్పులతో సామాన్య మహిళగా ఆస్పత్రికి వచ్చి టెస్టులు చేయించుకున్నారు. అనంతరం వైద్యులు ఆపరేషన్ చేసి, డెలివరీ చేశారు. స్నేహలత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో సర్కారు దవాఖానాలో డెలివరీ చేయించుకున్న అడిషనల్ కలెక్టర్ స్నేహలత అందరికీ ఆదర్శంగా నిలిచారని నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు. దీని వల్ల ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెరుగుతుందని చెబుతున్నారు.

Khammam Additional Collector blessed baby girl in Govt Hospital